శనివారం 30 మే 2020
Business - May 03, 2020 , 01:53:05

ఈ-కామర్స్‌కు రైట్‌.. రైట్‌..

ఈ-కామర్స్‌కు రైట్‌.. రైట్‌..

  • రేపట్నుంచి నాన్‌-ఎసెన్షియల్‌ ఐటెమ్స్‌ డెలివరీ

న్యూఢిల్లీ, మే 2: లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించిన కేంద్రం.. వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను సడలించింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తుల డెలివరీకి మాత్రమే పరిమితమైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఈ-కామర్స్‌ సంస్థలను ఈ నెల 4 నుంచి ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో నిత్యావసరేతర వస్తువుల (నాన్‌-ఎసెన్షియల్‌ ఐటెమ్స్‌) డెలివరీకి కూడా అనుమతించింది. కొవిడ్‌-19 వ్యాప్తి తీవ్రతను ఆధారంగా చేసుకొని దేశంలోని మొత్తం 733 జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా వర్గీకరించిన ప్రభుత్వం.. ఇకపై ప్రతి వారం ఈ జాబితాను సవరించనున్నది. ప్రస్తుతం రెడ్‌ జోన్లుగా ఉన్న ప్రాంతాలు మున్ముందు ఆరెంజ్‌ లేదా గ్రీన్‌ జోన్లుగా మారితే ఆ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి అన్ని రకాల వస్తులను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. రెడ్‌ జోన్‌లలో21 రోజులపాటు కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాకపోతే ఆ ప్రాంతం ఆరెంజ్‌ జోన్‌గా మారుతుంది.


logo