బుధవారం 03 జూన్ 2020
Business - Apr 24, 2020 , 12:26:13

ఫ్రాంక్లిన్ ఇండియా 6 ఫండ్స్ మూసివేత

ఫ్రాంక్లిన్ ఇండియా 6 ఫండ్స్ మూసివేత

హైదరాబాద్: భారత్ లో నిర్వహిస్తున్న 6 ఫండ్స్ మూసివేస్తున్నట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెల్లడించింది. ఆ ఫండ్స్ కింద ఉన్న సెక్యూరిటీలను కొద్దికాలం తర్వాత అమ్మేసి ఇన్వెస్టర్లకు దశలవారీగా చెల్లింపులు జరుపుతామని కంపెనీ తెలిపింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు వివరించింది. మూసేస్తున్న 6 ఫండ్స్ యొక్క మొత్తం అసెట్ విలువ రూ.25,856 కోట్లు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో లిక్విడిటీ సమస్య ఎదుర్కునే ఫండ్స్‌ను మాత్రమే మూసేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్స్ మూసేసి ఇన్వెస్టర్లకు డబ్బులవు వాపసు ఇవ్వడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్టు ఫ్రాంక్లిన్ ఇండియా (ఇండియా) అధ్యక్షుడు సంజయ్ సాప్రే చెప్పారు.

మూసివేస్తున్న ఫండ్స్ ఇవీ..

- ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్ 

- ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూవల్ ఫండ్

- ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్

- ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్‌కం ప్లాన్

- ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా‌షార్ట్ బాండ్ ఫండ్

- ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం అపార్చునిటీస్ ఫండ్


logo