బుధవారం 27 మే 2020
Business - Apr 06, 2020 , 00:00:34

రూ.1.1 లక్షల కోట్లు వెనక్కి

రూ.1.1 లక్షల కోట్లు వెనక్కి

-మార్చిలో ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: కరోనా రక్కసి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ విజృంభించడంతో గత నెలలో ఎఫ్‌పీఐలు  ఏకంగా లక్ష కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు మార్చిలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.61,793 కోట్ల నిధులను తరలించుకుపోయిన ఎఫ్‌పీఐలు.. బాండ్‌ మార్కెట్ల నుంచి రూ. 56, 211 కోట్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం గా రూ.1,18,184 కోట్లను తరలించుకుపోయినట్లు అయింది. సెప్టెంబర్‌ 2019 నుంచి వరుసగా ఆరు నెలలుగా వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు గత నెలలో వెనక్కితీసుకున్నారు. ఒక నెలలో ఇంతటి గరిష్ఠ స్థాయిలో వెనక్కితీసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత నెలలో జరిగిన రెండు సెషన్లలోనే రూ.6,735 కోట్ల నిధులను తరలించుకుపోయారు. వీటిలో ఈక్విటీల నుంచి రూ.3,802 కోట్లు, డెబిట్‌ మార్కెట్ల నుంచి రూ.2,933 కోట్లు. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో ఎఫ్‌పీఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గుచూపారని మార్నింగ్‌ స్టార్‌ హెడ్‌ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం కంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరి అధ్వాన్నంగా ఉన్నాయని, దీంతో గత నెలలో ఎఫ్‌పీఐలు 9.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. 


logo