శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Feb 05, 2021 , 21:18:10

స‌కాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌కుంటే.. ఇక అంతే!

స‌కాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌కుంటే.. ఇక అంతే!

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం బ్యాంకు రుణం పొందాలంటే క్రెడిట్ స్కోర్ చూశాకే సంబంధిత బ్యాంక‌ర్ రుణం మంజూరు చేయ‌డానికి ముందుకొస్తారు. క‌నుక రుణ వాయిదా చెల్లింపులు చ‌క్క‌గా చేస్తున్నారా? లేదా? అన్న సంగ‌తిని ప‌రిశీలిస్తారు. క‌నుక మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును తిరిగి స‌కాలంలో సక్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. లేక‌పోతే  క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. అది త‌క్కువ‌గా ఉంటే  భవిష్యత్‌లో మీకు రుణం ల‌భించ‌క‌పోవడంతోపాటు మీ ఆర్థిక ప‌రిస్థితిపై కూడా ప్ర‌భావం చూపుతుంది. 

క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు మీరు కనీస మొత్తాన్ని నిర్ణీత తేదీకి తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఆలస్యంగా చెల్లింపు రుసుము విధిస్తాయి. సాధారణంగా బిల్లు మొత్తంలో 5 శాతంం క‌నీస బిల్లు ఉంటుంది. దీనికి అదనంగా, మీ క్రెడిట్ కార్డులో ఉన్న ఏదైనా ఈఎంఐతో పాటు  వర్తించే ఛార్జీలు కూడా చెల్లించాల్సిన కనీస మొత్తానికి క‌లిపి లెక్కిస్తారు. 

కనీస మొత్తాన్ని చెల్లించకపోతే ఆలస్య రుసుము రూ. 1,300 వరకు చెల్లించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అలాగే, మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లు బకాయిల కంటే తక్కువ చెల్లించడంతో చెల్లించని బిల్లు మొత్తంలో 23 శాతం -49 శాతం వరకు భారీ ఛార్జీలు వ‌ర్తిస్తాయ‌ని ఆర్థిక‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక కనీస మొత్తాన్ని సకాలంలో చెల్లించడం వలన ఆలస్య చెల్లింపు రుసుము ఉండ‌దు కానీ  చెల్లించాల్సిన మొత్తంపై ఇప్పటికీ వర్తించే ఛార్జీల‌ను బ్యాంకులు వ‌సూలు చేస్తాయి. 

ఏదైనా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు బ్యాంకులు మొద‌ట మీ క్రెడిట్ స్కోర్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి.  మీరు రుణం తిరిగి చెల్లించే చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోరు ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లును సక్రమంగా తిరిగి చెల్లించ‌క‌పోవ‌డం క్రెడిట్ స్కోర్‌ను తగ్గించగలదు. తగ్గిన క్రెడిట్ స్కోరు మీ భవిష్యత్ రుణ అవ‌కాశాలు, క్రెడిట్ కార్డ్ అర్హతను కూడా దెబ్బతీస్తుంది.

స‌మ‌యానికి రుణ వాయిదాల‌ను చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నాయని రుణదాతలు గ్ర‌హించి మీకు రుణం జారీచేయ‌డం అధిక-రిస్క్‌గా భావిస్తారు. ఒక్క ఆలస్య చెల్లింపు కూడా  మీ స్టేట్‌మెంట్‌లో ఏడేండ్ల‌ వ‌ర‌కు  క‌నిపిస్తుంది. ఇది మీ క్రెడిట్ విలువను ప్రభావితం చేస్తుంది. మున్ముందు మీకు రుణం జారీ చేయాలా? లేదా? అని బ్యాంకులు నిర్ణయించే అత్యంత కీలకమైన అంశాల్లో పేమెంట్స్‌ చరిత్ర ఒకటి. 

మీ క్రెడిట్ కార్డ్ లావాదేవీ చేసిన తేదీ నుంచి చెల్లింపు గడువు తేదీ వ్యవధి వ‌ర‌కు వ‌డ్డీ వ‌ర్తించ‌దు. దీనికి సాధారణంగా 18- 55 రోజుల టైం ఉంటుంది. ఈ స‌మ‌యంలో జరిపిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వ‌డ్డీ ఉండదు.  బకాయిలు నిర్ణీత తేదీ నాటికి తిరిగి చెల్లిస్తే ఈ వ‌స‌తి ల‌భిస్తుంది.

మీ మొత్తం క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, కార్డ్ జారీచేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు మీ వడ్డీ లేని కాలాన్ని ఉపసంహరించుకోవ‌డంతోపాటు మొత్తం బకాయిలు తిరిగి చెల్లించే వరకు తాజా క్రెడిట్ లావాదేవీలపై ఫైనాన్స్ ఛార్జీలను విధిస్తాయి. తదుపరి బిల్లింగ్ చక్రంలో మీ తాజా లావాదేవీలపై వర్తించే ఫైనాన్స్ ఛార్జీలను కూడా వ‌సూలుచేస్తారు.

మీ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రుణదాతలు మీకు ముందుగా ఆమోదించిన‌ రుణాలు, క్రెడిట్ కార్డుల ఆఫర్ల‌ను అందిస్తారు. క్రెడిట్‌ చరిత్ర బాగా లేక‌పోతే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డ‌టంతోపాటు ఆఫ‌ర్లు ల‌భించ‌వు. సాధారణంగా ఈ ఆఫ‌ర్ల‌లో వ‌స్తువులు త‌క్కువ‌కు ల‌భించ‌డం లేదా ప్రాసెసింగ్ స‌మ‌యం త‌క్కువ.  క్రెడిట్ కార్డ్ అర్హత ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు మీ రుణ‌ ప్ర‌యోజ‌నాల కోసం ఇత‌ర బ్యాంకుల‌తో  చర్చలు జరపడానికి కూడా మంచి క్రెడిట్ స్కోర్ సాయ‌ప‌డుతుంది.

క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు తమ వినియోగదారులకు క్రమశిక్షణతో తిరిగి చెల్లించే చరిత్ర, లావాదేవీల సరళి, కార్డ్ రకం మొదలైన వాటి ఆధారంగా క్రెడిట్ కార్డులపై ముందస్తుగా ఆమోదించిన‌ రుణాలను అందిస్తారు. ఈ రుణాలకు తక్షణ పంపిణీ, ఐదేండ్ల‌ వరకు తిరిగి చెల్లించే గ‌డువు ఉంటుంది. కొన్ని సంస్థలు తాము ఇచ్చిన‌ క్రెడిట్ పరిమితికి మించి ఎక్కువ రుణాలు కూడా జారీచేస్తాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo