బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 19:12:28

సీ వ్యూ ప్లాట్ల కోసం 76 కోట్లు పెట్టిన ఆ బ్యాంక్‌ మాజీ ఎండీ

సీ వ్యూ ప్లాట్ల కోసం 76 కోట్లు పెట్టిన ఆ బ్యాంక్‌ మాజీ ఎండీ

ముంబై : ప‌్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇల్లును అందంగా ఉండేలా నిర్మాణం చేసుకోవాల‌ని అనుకుంటుంటారు. ఇక ఓ స్థాయిలో ఉన్న వ్య‌క్తులైతే ఓ అడుగు ముందేసి.. ల‌గ్జ‌రీ ప్లాట్ల‌ను కొనుగోలు చేయాల‌నుకుంటారు. ఇంట్లోనే ఉండి అన్ని ర‌కాల అనుభూతుల‌ను పొందాల‌ని తాపత్రాయం చెందుతుంటారు. ఆ విధంగా ఇల్లు కావాల‌నుకునే వారు.. ఏ న‌దీ తీరంలోనూ, స‌ముద్ర తీరంలోనూ లేదా ప్ర‌ఖ్యాతిగాంచిన ప‌ట్ట‌ణాల్లో ఇండ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. అదే స‌ముద్ర తీరంలోనూ అయితే.. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారు. అదే కోవ‌లో ఆలోచించాడేమో.. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ మాజీ ఎండీ.. ముంబై స‌ముద్ర తీరంలో సీ-వ్యూ ప్లాట్ల కోసం ఏకంగా రూ. 76 కోట్లు వెచ్చించారు. 

ముంబైలోని ఒబెరాయ్ రియాల్టీలో ఇండ‌స్ ఇండ్ బ్యాంకు మాజీ ఎండీ రోమేష్ సోబ్తీ, అత‌ని భార్య రెండు సీ-వ్యూ ప్లాట్ల‌ను కొనుగోలు చేశారు. ఈ రెండు కూడా సూప‌ర్ ల‌గ్జ‌రీ ప్లాట్లు. అయితే 65 అంత‌స్తుల ట‌వ‌ర్ లో ఉన్న ఈ రెండు ప్లాట్ల ధ‌ర రూ. 76.30 కోట్లు.  ఈ రెండు కూడా 39, 40వ అంత‌స్తులో ఉన్నాయి. ఒక్కో ప్లాట్ లో నాలుగు ప‌డ‌క గ‌దులు ఉన్నాయి. రెండు ప్లాట్ల విస్తీర్ణం 12,250 చ‌ద‌ర‌పు అడుగులు. ప్ర‌తి ప్లాట్ ధ‌ర రూ. 38.15 కోట్లు. వీటి కొనుగోలుకు మొత్తం స్టాంప్ డ్యూటీని రూ. 4.60 కోట్లు చెల్లించారు. ప్లాట్ల కొనుగోలుకు సంబంధించి జూన్ 24న అంగీకారం కుదిరింది. 


logo