మంగళవారం 27 అక్టోబర్ 2020
Business - Sep 23, 2020 , 00:49:40

మురుగప్ప కుటుంబంలో ముసలం!

మురుగప్ప కుటుంబంలో ముసలం!

చెన్నై: మురుగప్ప కుటుంబంలో ముసలం పుట్టింది. కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఎంవీ మురుగప్ప పెద్ద కుమార్తె వల్లి అరుణాచలంను కంపెనీ బోర్డులోకి తీసుకోవాలన్న ప్రతిపాదనపై జరిపిన ఓటింగ్‌లో ఆమెకు చుక్కెదురైంది. ఈ నెల 21న వాటాదారులు సమావేశంలో నిర్వహించిన ఈ ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా 8.64 శాతం మంది, వ్యతిరేకంగా 91.36 శాతం మంది ఓటువేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మురుగప్ప గ్రూపులో మెజార్టీ వాటా కలిగిన కుటుంబం కూడా తనకు వ్యతిరేకంగా ఓటు వేసిందని వాపోయారు. బోర్డులో సభ్యత్వం కోసం ఏడాది నుంచి ప్రయత్నించినప్పటికీ విఫలమైనట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. 


logo