టెస్లాకు పోటీగా మాజీ ఉద్యోగి కారు

న్యూఢిల్లీ : హెవీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు ప్రపంచంలో ఈవీ రంగంలో విపరీతమైన ఆధిపత్యం ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఎలాన్ మస్క్ తయారుచేసే కార్లకు పోటీ ఇచ్చేందుకు మరొకరు ముందుకు వచ్చారు. ఆయన మరెవ్వరో కాదు. టెస్లా మాజీ ఉద్యోగే. టెస్లా సంస్థ ఈ దశకు చేరుకోవడంలో ప్రధాన కారకుడు అయిన పీటర్ రావ్లిన్సన్. టెస్లా సంస్థ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఎలాన్ మస్క్ సంస్థ సాధనలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉద్యోగులంతా భావిస్తుంటారు. అలాంటి పీటర్ రావ్లిన్సన్.. టెస్లా నుంచి బయటకు వచ్చి లూసిడ్ మోటార్స్ అనే సంస్థను ప్రారంభించి ఎలక్ట్రిక్ కార్ల తయారీని మొదలెట్టింది. పీటర్ రావ్లిసన్ ఇటీవల తన బ్రాండ్ కింద విడుదలైన మొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ కారును టెస్లా కార్లతో పోల్చినట్లు పలు మీడియా నివేదికలు చెప్తున్నాయి.
టెస్లా తన ఉన్నతమైన సాంకేతికతకు ప్రపంచంలో పేరుగాంచిందని పీటర్ చెప్తున్నారు. ఈ కారణంగానే టెస్లా కార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. లగ్జరీ కార్ల తయారీ వైపు పయనిస్తున్నందున టెస్లాతో మాకు ప్రత్యక్ష పోటీ లేదని అంటున్నారు పీటర్ రావ్లిన్సన్. ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం విషయానికొస్తే.. మా మొదటి కారు లూసిడ్ ఎయిర్ ఆధునికతలో టెస్లా కార్లతో సరిపోలగలదంటున్నారు. మెర్సిడెస్ బెంజ్, జీఎమ్ వంటి సంస్థలతో మార్కెట్లో పోటీపడటానికి సిద్ధంగా ఉన్నామని పీటర్ చెప్పారు.
ప్రస్తుతం లూసిడ్ మోటార్స్ కంపెనీ.. పదేండ్ల క్రితం టెస్లా ఉన్న చోటనే ఉండటం విశేషం. టెస్లా ప్రసిద్ధ మోడల్ ఎస్ సృష్టిలో పీటర్ పాల్గొన్నాడు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో మరో బలమైన పోటీదారు రాక ఖచ్చితంగా టెస్లాకు పెద్ద ఎదురుదెబ్బ కావచ్చని పరిశీలకులు అంటున్నారు. మిగతా లగ్జరీ ఈవీల కన్నా తమ కారును సరసమైన ధరలకు అందించడానికి ప్రయత్నిస్తానని పీటర్ చెప్తున్నాడు. 2009 లో టెస్లాతో సంబంధం కలిగి ఉన్న పీటర్.. ఆ తరువాత కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా, 2010 లో మోడల్ ఎస్ కోసం చీఫ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందాడు. 2012 లో అతను టెస్లాను విడిచిపెట్టి ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాడు. ఏడాది తరువాత ఒక కొత్త కంపెనీలో పనిచేయడం ప్రారంభించిన పీటర్. 2016 లో లూసిడ్ మోటార్స్‌ను ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి..
నేను 180 ఏండ్లు బతుకుతా..
మహారాష్ట్రలో నేవీ ఉద్యోగిని సజీవదహనం చేసిన కిడ్నాపర్లు
చరిత్రలో ఈరోజు.. ముక్కలైన రెండు వేల ఏండ్ల నాటి వేస్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్‌తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్‌పై లైంగిక దాడి!
- లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!