బుధవారం 03 మార్చి 2021
Business - Feb 13, 2021 , 03:01:56

విదేశీ నిల్వల్లో క్షీణత

విదేశీ నిల్వల్లో క్షీణత

ముంబై, ఫిబ్రవరి 12: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ మారకం నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 5తో ముగిసిన వారాంతానికి 6.24 బిలియన్‌ డాలర్లు తగ్గి 583.945 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వు బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో 4.852 బిలియన్‌ డాలర్లు పెరిగి రికార్డు స్థాయి 590.185 బిలియన్‌ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడం ఇందుకు కారణమని సెంట్రల్‌ బ్యాంక్‌ విశ్లేషించింది. గతవారంలో 4.88 బిలియన్‌ డాలర్లు తరిగిపోయి 542.338 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు వారాంతపు నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.  అలాగే 1.327 బిలియన్‌ డాలర్లు తగ్గిన పసిడి రిజర్వులు 34.967 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

VIDEOS

logo