మహీంద్రా-ఫోర్డ్‌కు కరోనా సెగ

- ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఇరు సంస్థలు
న్యూఢిల్లీ, జనవరి 1: భారత్‌లో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రాతో ఖరారు కావాల్సిన జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన వాహన సంస్థ ఫోర్డ్ మోటార్ ప్రకటించింది. ఈ ఒప్పందం గురువారం ఖరారు కావాల్సి ఉండగా, కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మార్కెట్లో తలెత్తిన ప్రతికూల ప్రభావం ఈ భాగస్వామ్యంపై ముందు కు తీసుకెళ్లలేకపోతున్నామని ఇరు సంస్థ లు ప్రకటించాయి. అయినప్పటికీ, ఫోర్డ్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటించాయి. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించేందుకు తమ పెట్టుబడుల ప్రాధాన్యాలను పున: సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించాయి. ఈ నిర్ణయం ఇరు సంస్థల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపాయి.
ఫోర్డ్ కార్యకలాపాలు యథాతథం
మహీంద్రాతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ భారత్‌లో యథాతథంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయని ఫోర్డ్ ఇండియా ప్రకటించింది. వాహన విభాగ పరిధిని మరింత విస్తరించడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు, సరాసరి 8 శాతం వృద్ధిని సాధించడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అత్యంత విలువైన, నాణ్యమైన, కనెక్టెడ్ వాహనాలతోపాటు విద్యుత్‌తో నడిచే వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ గోయెంకా మాట్లాడుతూ..కరోనా కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పంద ప్రతిపాదనపై వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు.
కొవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో ఈ జాయింట్‌తో వెంచర్ ముందుకు వెళ్ళలేమని గ్రహించినట్లు చెప్పారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ జాయింట్ వెంచర్లో మహీంద్రా రూ.1,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగతా రూ.1,500 కోట్లు రుణం రూపంలో తీసుకోవాలని రెండేండ్ల క్రితం ప్రతిపాదించారు.
టాప్‌గేర్‌లో...వాహన అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి.
విక్రయాలను పెంచుకోవడానికి సంస్థలు భారీగా రాయితీలు ఇవ్వడం, మరోవైపు అలాగే నూతన సంవత్సరంలో కొనుగోలుదారులకు షాకిస్తూ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడంతో డిసెంబర్లో అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్, టయోటాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కానీ, మహీంద్రా మాత్రం ప్రతికూల వృద్ధిని కనబరిచింది.
తాజావార్తలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు