Home loans Affordable | సొంతిండ్లు కొనుగోలు చేసేవారికి బ్యాంకర్లు శుభవార్తనందించారు. ఇప్పటికే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఇండ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేశాయి. అయితే ఎస్బీఐ మినహా పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేనెల 30వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేశాయి. మీరు సొంతిల్లు కొనుగోలు చేయాలని భావిస్తే ఏయే బ్యాంకుల్లో వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో ముందుగా ఎంక్వయిరీ చేసుకోవాలి. అలాగే ఆయా బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉందో తెలుసుకోవాలి.
ఈ బ్యాంకుల్లో ఇలా వడ్డీరేట్లు
ఇప్పటికైతే ప్రైవేట్ బ్యాంకర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ చౌకగా6.65 శాతం వడ్డీరేటుకే ఇంటి రుణాలు ఇస్తున్నది. అటుపై ఎల్ఐసీ అనుబంధ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 6.66 శాతానికి హోం లోన్ మంజూరు చేస్తున్నది. ఇంకా పలు బ్యాంకులు ఏడు శాతం లోపు వడ్డీరేటుకే రుణాలిస్తున్నాయి. రూ. 10 లక్షల రుణం తీసుకుని 20 ఏండ్ల టెన్యూర్ పెట్టుకుంటే వాయిదా చెల్లింపులు ఎంత, మొత్తం 20 ఏండ్లలో అదనంగా ఎంత వడ్డీ భారం పడుతుందో ఓ లుక్కేద్దాం
బ్యాంక్- – – – – – – – వడ్డీ (%) – ప్రాసెసింగ్ ఫీజు – – – – – ఈఎంఐ – మొత్తం వడ్డీభారం
కొటక్ మహీంద్రా- 6.65 – – – గరిష్ఠంగా రూ.10 వేలు – రూ.7,544 – రూ.8.11 లక్షలు
ఎల్ఐసీహౌసింగ్- 6.66 – – – రూ.10 -రూ.15 వేలు – — రూ.7,550 – రూ.8.12 లక్షలు
ఐసీఐసీఐ – – – – – 6.70 – – – 0.25% నుంచి రూ.5000- రూ.7,574 – రూ.8.18 లక్షలు
ఎస్బీఐ – – – – – – – 6.70 – – – ఆగస్టు వరకు మాఫీ — – – రూ.7,633 – రూ. 8.32 లక్షలు
పీఎన్బీ – – – – – – – 6.80 – – – సెప్టెంబర్ వరకు మాఫీ –
హోంలోన్ తీసుకునే ముందు నాలుగు అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి.
తేలిగ్గా హోం లోన్ కావాలంటే తక్కువ మొత్తం రుణానికి దరఖాస్తు చేసుకోవాలి. అంటే మీరు మీ సొంతింటి నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేయాలి. తక్కువ రుణం కోసం దరఖాస్తుతో ఆస్తిలో కొనుగోలు దారు భాగస్వామ్యం ఎక్కువ అవుతుంది. బ్యాంక్ రిస్క్ తగ్గుతుంది. మీరు రుణం పొందే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా ఇంటి స్థలం విలువలో 75-90 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. మిగతా మొత్తం రుణ గ్రహీత డౌన్ పేమెంట్‌గా లేదా మార్జిన్ కంట్రిబ్యూషన్‌గా చెల్లించాలి. ఈ ప్రక్రియ చేపట్టకుండా మీకు రుణం మంజూరు కాదు.
మీరు ఇంటి రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు బ్యాంకు కూడా మీకు ఫిక్స్‌డ్‌గా వచ్చే ఆదాయ నిష్పత్తి (ఎఫ్వోఐఆర్)ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి నెలా ఎంత మేరకు ఈఎంఐ చెల్లిస్తారన్న విషయాన్ని ఆదాయ నిష్పత్తి తెలియజేస్తుంది. ఇప్పటికే మీరు చెల్లిస్తున్న రుణ వాయిదాలు, ఇంటి అద్దె, బీమా పాలసీ, ఇతర చెల్లింపులు మీ ఆదాయం కిందకు వస్తాయి. మీ ఆదాయంలో 50 శాతం ఖర్చులు ఉంటే మాత్రం బ్యాంకర్ రుణ దరఖాస్తు తిరస్కరిస్తారు. కనుక మీరు మీ రుణ దరఖాస్తు సమర్పించే ముందు ఎంత రుణం కావాలో నిర్దేశించుకోవాలి.
పలు బ్యాంకులు లోన్ ప్రీ పేమెంట్‌పై లెవీ విధిస్తున్నాయి. ముందస్తు రీపేమెంట్ వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీరేటు ఖరారు చేస్తాయి. ఇటువంటి తరుణంలో స్వల్పకాలిక షరతులు విధిస్తాయి. ఇంటి రుణం తీసుకోవడానికి ముందు దీనిపై పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవాలి.
మీ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు నుంచే రుణం తీసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా క్రెడిట్ కార్డు సర్వీసును ఉపయోగించుకుంటున్న బ్యాంకులోనూ రుణం తీసుకోవచ్చు. బ్యాంకర్లు తమ రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే రుణాలిస్తాయి. అదీ కూడా రీజనబుల్ వడ్డీరేట్లపై రుణాలందిస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు