గురువారం 28 మే 2020
Business - Apr 02, 2020 , 22:54:39

భవిష్యత్తుపై దృష్టి పెట్టండి

భవిష్యత్తుపై దృష్టి పెట్టండి

-ఉద్యోగులకు ఆనంద్‌ మహీంద్రా లేఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ప్రస్తుత సంక్షోభ సమయంలో తమ ఉద్యోగులకు మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా హితబోధ చేశారు. అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని, ఈ కఠిన పరిస్థితుల అనంతరం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఈ విరామ సమయాన్ని నూతన ఆవిష్కరణలకు వినియోగించుకోవాలని, కొత్తకొత్త ఆలోచనలతో తమ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అవసరమైన బాటలు వేసుకోవాలని సలహా ఇచ్చారు. గతంలో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మాంద్యం అనుభవాలను, దాన్నుంచి నేర్చుకున్న పాఠాలను గుర్తుచేసుకుని ముందుకు సాగాలని 2 లక్షలకుపైగా ఉద్యోగులనుద్దేశించి రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు.


logo