మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jun 28, 2020 , 01:22:16

సేవింగ్‌ బాండ్లపై ఫ్లోటింగ్‌ రేటు

సేవింగ్‌ బాండ్లపై ఫ్లోటింగ్‌ రేటు

  • వచ్చే నెల 1నుంచి జారీ చేయనున్న కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 27: ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం తాజాగా వచ్చే నెల 1 నుంచి ఫ్లోటింగ్‌ రేటు ఆధారంగా సేవింగ్‌ బాండ్లు 2020ని జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. పన్ను పరిధిలోకి రానున్న ఈనూతన స్కీంపై 7.75 శాతం వార్షిక వడ్డీని చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఏడేండ్ల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లపై ప్రతియేటా జనవరి 1, జూలై 1న వడ్డీని చెల్లించనున్నది. అలాగే వచ్చే ఏడాది జనవరి 1న మాత్రం వడ్డీని 7.15 శాతం చెల్లించనున్నది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఈ బాండ్లు పన్ను పరిధిలోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలమేరకు రిజర్వుబ్యాంక్‌ ఈ బాండ్లను జారీ చేయనున్నది. 


logo