బుధవారం 30 సెప్టెంబర్ 2020
Business - Sep 16, 2020 , 01:01:54

ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల ఉద్యోగాలు

ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ సేవల సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వచ్చే పండుగ సీజన్‌, బిగ్‌ బిలియన్‌ డేస్‌(బీబీడీ) దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 70 వేల మందిని, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్నది. బెంగళూరు కేంద్రస్థానంగా ఈ-కామర్స్‌ సేవలు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌.. సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్యాకర్లు, స్టోర్‌ కీపర్లు, మానవ వనరుల విభాగంలో మరింత మందిని నియమించుకోబోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.  బిగ్‌ బలియన్‌ డేస్‌ సందర్భంగా అదనపు అవకాశాలు ఇస్తూనే వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని ఇచ్చేందుకు ప్రభావంతమైన భాగస్వామ్యాలు సృష్టించడంపై దృష్టి సారించినట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమితేష్‌ జా తెలిపారు. ఉపాధి కల్పన ద్వారా తమ విక్రయదారు వ్యాపారాన్ని పెంచడం ద్వారా, వ్యాపార ఆర్థికంగా వృద్ధిని సాధించడానికి వీలు పడుతున్నదన్నారు. logo