శుక్రవారం 05 జూన్ 2020
Business - May 20, 2020 , 00:25:33

విశాల్‌ హోమ్‌ డెలివరీలు

విశాల్‌ హోమ్‌ డెలివరీలు

  • -ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి హైదరాబాద్‌లో ప్రారంభించిన సంస్థ 

న్యూఢిల్లీ, మే 19: ప్రముఖ రిటైల్‌ చెయిన్‌ విశాల్‌ మెగామార్ట్‌.. హోమ్‌ డెలివరీ సేవలు ఆరంభించింది. ఇందుకోసం ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా మరో 22 నగరాల్లో బుకింగ్‌ చేసుకున్న వస్తువులను ఇంటికి తెచ్చి ఇవ్వనున్నారు. విశాల్‌ మెగామార్ట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 365 స్టోర్లలో లభించే వస్తువులను బుకింగ్‌ చేసుకున్న వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ చేయనున్నది. బియ్యం, నూనె, పప్పు దినుసులు, శీతలపానియాలతోపాటు ఇతర వస్తువులను బుకింగ్‌ చేసుకోవచ్చునని సంస్థ సూచించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జోన్లలో ఈ వస్తువులను అందిస్తున్నట్లు తెలిపింది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం 26 నగరాల్లో ఈ సేవలు అందిస్తున్న సంస్థ.. వచ్చే నాలుగు వారాల్లో 240 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. 


logo