గురువారం 04 మార్చి 2021
Business - Dec 30, 2020 , 00:22:41

స్మార్ట్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్‌ సేల్‌ ఆఫర్లు ఇవే

స్మార్ట్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్‌ సేల్‌ ఆఫర్లు ఇవే

న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో 2020కి గుడ్‌బై చెప్పి నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్న తరుణంలో ఈ-కామర్స్‌ మేజర్‌ ఫ్లిప్‌కార్ట్‌ పలు మొబైల్‌ ఫోన్లపై ఇయర్‌ ఎండ్‌ సేల్‌ సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. మంగళవారం మొదలైన ఈ ఆఫర్లు గురువారం అర్థరాత్రి అమలులో ఉంటాయి.  పొకో  ఎక్స్‌3, ఐ ఫోన్‌ ఎక్స్‌ ఆర్‌, ఐ ఫోన్‌ ఎస్‌ఈ (2020), మోటో జీ9, మోటరోలా రేజర్‌ (2019), టెక్నో స్పార్క్‌ పవర్‌ 2 ఎయిర్‌ తదితర ఫోన్లపై ఈ ఆఫర్లు లభ్యం అవుతాయి. ఇంకా శ్యామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 41, ఎంఐ 10టీ, వివో  వీ20 ప్రో మోడల్‌ ఫోన్లపై అదనంగా ఎక్స్చేంజ్‌ ఆఫర్లు కూడా అందిస్తున్నది.

ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి కొనుగోలు దారులకు పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ ఇస్తున్నది. కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్లపై భారం పడబోదని ప్రకటించింది. ఇయర్‌ ఎండ్‌ సేల్స్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకంగా మైక్రో సైట్‌ కూడా ఏర్పాటు చేసింది. పొకో ఎక్స్‌ 3 ఫోన్‌ ధర రూ.15,999 కాగా, 6జీబీ + 64జీబీ స్టోరేజీ ఆప్షన్ ఫోన్‌ ధర రూ.16,999. అయితే అది కూడా రూ.15,999లకే అందుబాటులో ఉంది.   

మోటో జీ9 ఫోన్‌ ధర రూ. 11,499 నుంచి రూ.10,999లకు, మోటరోలా రేజర్‌ (2019) ఫోన్ ధర డిస్కౌంట్‌మీద రూ.74,999లకు లభిస్తుంది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ధర రూ.47,900 నుంచి రూ.38,999లకు అందిస్తున్నది. టెక్నో స్పార్క్‌ పవర్ 2 ఎయిర్‌ మోడల్‌ ఫోన్‌ రూ.8,499 నుంచి రూ.7,999లకు తగ్గించి విక్రయిస్తున్నది. శ్యామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌41, ఒప్పో రెనో 2ఎఫ్‌, మోటరోలా వన్‌ ఫ్యూజన్‌ ప్లస్‌ మోడల్ ఫోన్లు ఎక్స్చేంజిపై రూ.1000 తగ్గించి అందుబాటులోకి తెచ్చింది. వివో వీ 20 ప్రో, వివో వై 50 మోడల్‌ ఫోన్లపై రూ.2500 డిస్కౌంట్లు అందిస్తున్నది. 

VIDEOS

logo