గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 21:58:41

అరవింద్ ఫ్యాషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు

అరవింద్ ఫ్యాషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు

బెంగళూరు: అరవింద్ ఫ్యాషన్స్ అనుబంధ సంస్థ అరవింద్ యూత్ బ్రాండ్స్‌లో గణనీయమైన మైనారిటీ వాటాను కొనుగోలు చేయడానికి రూ.260 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ గురువారం ప్రకటించింది. అరవింద్ యూత్ బ్రాండ్స్ ప్రసిద్ధ ఫ్లయింగ్ మెషిన్ డెనిమ్ బ్రాండ్‌ను కలిగి ఉన్నది ఇది ఫ్లిప్‌కార్ట్, మైంట్రాలో ఆరు సంవత్సరాలకు పైగా రిటైల్ అవుతున్నది.

ఈ పెట్టుబడితో ఆకర్షణీయమైన ధరల వద్ద బలమైన విలువ ప్రతిపాదనలతో ఉత్పత్తులను ఆవిష్కరించడానికి, అభివృద్ధి చేయడానికి అవకాశాలతోపాటు సినర్జీలను గుర్తించడానికి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, అరవింద్ ఫ్యాషన్‌లు పరస్పర సహకారంతో పనిచేస్తాయని ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఒక ప్రకటనలో తెలిపింది. "అరవింద్ యూత్ బ్రాండ్స్ బృందంతో భాగస్వామ్యం కావాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాము. దాని ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో కోసం మార్కెట్‌ను పెంచుకోవడంతోపాటు గత కొన్ని దశాబ్దాలుగా నిర్మించిన బలమైన బ్రాండ్ ఈక్విటీని పెంచడానికి పనిచేస్తాం" అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. 

అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ యూఎస్ పోలో అస్న్, ఆరో, జీఏపీ, టామీ హిల్ఫిగర్, కాల్విన్ క్లీన్, ఫ్లయింగ్ మెషిన్, ఏరోపోస్టేల్, ది చిల్డ్రన్స్ ప్లేస్, ఎడ్ హార్డీ వంటి అంతర్జాతీయ, స్వదేశీ ప్రసిద్ధ బ్రాండ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నది. ఇది సెఫోరాతో కలిసి భారతదేశపు ప్రముఖ బ్యూటీ రిటైలర్, ఫ్యాషన్ రిటైల్ చైన్ అన్‌లిమిటెడ్‌ను కలిగి ఉన్నది. 


logo