శనివారం 31 అక్టోబర్ 2020
Business - Sep 30, 2020 , 03:28:30

ఫ్లిప్‌కార్ట్‌ సైబర్‌ బీమా

ఫ్లిప్‌కార్ట్‌ సైబర్‌ బీమా

న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో జోడీ కట్టింది. సైబర్‌ దాడులు, మోసాలు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో జరిగే అక్రమ కార్యకలాపాలతో జరిగే ఆర్థిక నష్టాల నుంచి కస్టమర్లకు బీమా రక్షణ కల్పించేందుకు బజాజ్‌ అలియాన్జ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. సైబర్‌ దాడులు, మోసాలతోపాటు పిషింగ్‌/స్పూఫింగ్‌, సిమ్‌ జాకింగ్‌ లాంటి అక్రమాల వల్ల నష్టపోయినవారికి పరిహారం చెల్లించేందుకు ‘డిజిటల్‌ సురక్షా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌' పథకాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. ఈ పథకం కింద కస్టమర్లు ఏడాదికి రూ.183 ప్రీమియం చెల్లించి రూ.50 వేల బీమా రక్షణ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.