బుధవారం 02 డిసెంబర్ 2020
Business - Oct 23, 2020 , 17:11:46

ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ భారీ డీల్...!

 ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ భారీ డీల్...!

ఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్)లో వాటాను కొనుగోలు చే సేందుకు సిద్ధమైంది. దీని ద్వారా ఏబీఎఫ్ఆర్ఎల్ రూ.1,500 కోట్ల నిధులను సమీకరించనున్నది. ఈ మేరకు శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. వీటిని ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ షేర్స్ ద్వారా సమీకరిస్తుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్‌లో ఫ్లిప్‌కార్ట్ రూ.1500 కోట్ల (203.78 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్ట డం ద్వారా 7.8 శాతం వాటాను దక్కించుకోనుంది. పాంటాలూన్స్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కో షేర్‌కు రూ.205 వద్ద ట్రాన్సాక్షన్ జరగనుంది. గురువారం ఈ షేర్ రూ.153.40 వద్ద ముగిసింది.

ఈ క్లోజింగ్ ధరతో 33.63 శాతం అధికం. ఈ మేరకు కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. దీంతో దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే అవకాశం ఉందని ఏబీఎఫ్ఆర్ఎల్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. వచ్చే ఐదేండ్లలో దేశీయ దుస్తుల పరిశ్రమ 100 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునన్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా వచ్చే నిధులు బ్యాలెన్స్ షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకు వినియోగిస్తామన్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం అనంతరం ప్రమోటర్ల వాటా 55.13 శాతానికి తగ్గనుంది.

ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ లో ఫ్లిప్‌కార్ట్ వాటా కొనుగోలు వార్త నేపథ్యంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ స్టాక్ శుక్రవారం భారీగా ఎగిసింది. 13.15 శాతం లాభపడి రూ.175 వరకు చేరుకుంది. 2020లో ఆఫ్‌లైన్ కన్స్యూమర్ స్పేస్‌లో ఇది రెండో పెద్ద డీల్ అవుతుంది. ఆగస్టు నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్.. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాన్ని రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ కి దేశవ్యాప్తంగా 3,004 స్టోర్స్ ఉన్నాయి. 23,700 మల్టీ బ్రాండ్ ఔట్ లెట్లలో ఉన్నాయి. పాంటాలూన్స్ రిటైల్‌తో పాటు వాన్ హ్యూసెన్, లూయిస్ పిలిప్, అలెన్ సోలి, పీటర్ ఇంగ్లాండ్ ఉన్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.