శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 05, 2021 , 13:09:32

ఏప్రిల్‌ నుంచి పెరగనున్న ఎఫ్‌డీ వడ్డీరేట్లు

ఏప్రిల్‌ నుంచి పెరగనున్న ఎఫ్‌డీ వడ్డీరేట్లు

న్యూఢిల్లీ : మదుపుదారులకు ఊరట కలిగించేలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఏప్రిల్‌ నుంచి పెరిగే అవకాశం ఉంది. బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని గతంలో మాదిరి నాలుగు శాతానికి తీసుకురావాలని ఆర్‌బీఐ యోచిస్తుండటంతో డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను మూడు శాతానికి తగ్గించింది. సీఆర్‌ఆర్‌ను క్రమంగా తిరిగి యథాతథ స్థితికి తీసుకురావాలని కేంద్ర బ్యాంక్‌ భావిస్తోంది.

ఈ ఏడాది మార్చి 27 నుంచి సీఆర్‌ఆర్‌ను ౩.5 శాతానికి పెంచి మే 22 నుంచి 4 శాతానికి తీసుకొస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం పేర్కొన్నారు. అయితే రుణ గ్రహీతలపై మాత్రం ఇది భారం మోపనుంది. రుణాలపై వడ్డీరేట్లకు కూడా రెక్కలు రానున్నాయి. అయితే ఎంతమేర డిపాజిట్‌, రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయని ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. సీఆర్‌ఆర్‌ పెంచితే బ్యాంకర్ల వద్ద నగదు లభ్యత తగ్గడం వల్లే డిపాజిట్‌, లోన్‌లపై వడ్డీరేట్లకు రెక్కలు వస్తాయి. 

VIDEOS

logo