ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 17, 2020 , 17:18:48

ఏడాదిలో ఆ 5 కంపెనీల సంపద బిలియన్‌ డాలర్లు రైజ్‌

 ఏడాదిలో ఆ 5 కంపెనీల సంపద బిలియన్‌ డాలర్లు రైజ్‌

అహ్మదాబాద్‌: కరోనా మహమ్మారి పలు కంపెనీలను దివాళా తీయించినా గుజరాత్‌కు చెందిన ఐదు కార్పొరేట్‌ సంస్థలు మాత్రం 2020లో బిలియన్‌ డాలర్లకు పైగా తమ సంపద (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌)ను పెంచుకున్నాయి. ఆ జాబితాలో ఆదానీ గ్రూప్‌నకు చెందిన ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌), ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌), మూడు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఉన్నాయి.  క్యాడిల్లా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌, టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ సంస్థలు.. బిలియన్ డాలర్ల సంపద పెంచుకున్న జాబితాలో చేరాయి. 

2019తో పోలిస్తే ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ.. 17.9 బిలియన్‌ డాలర్ల సంపద పెంచుకోగా, ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.8 బిలియన్‌ డాలర్ల సంపద సమకూర్చుకున్నది. ఇక క్యాడిల్లా హెల్త్‌కేర్‌ 2.9 బిలియన్‌ డాలర్లు, టోరెంట్‌ ఫార్మా 2.2 బిలియన్ల డాలర్లు, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ 1.5 బిలియన్‌ డాలర్ల సంపద పెంచుకున్నాయి. 

సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను టేకోవర్‌ చేయడంతో ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థల షేర్లు దూసుకెళ్లడానికి కారణమైంది. కొవిడ్‌-19 మహమ్మారి కాలంలో ఔషధాలకు డిమాండ్‌ పెరిగిపోవడంతో ఫార్మా సంస్థల షేర్లు దూసుకెళ్తున్నాయి. 

గుజరాత్‌ కేంద్రంగా ఉత్పత్తి సాగిస్తున్న ఫార్మా సంస్థలు భారీ రిటర్న్స్‌ సాధించాయని అహ్మదాబాద్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ డైరెక్టర్‌ అసిఫ్‌ హిరాణీ చెప్పారు. అలెంబిక్‌ ఫార్మా సేల్స్‌ 40 శాతం పెరిగిపోగా, టోరెంట్‌ రిటర్న్స్‌ 51 శాతం ఎక్కువగా నమోదయ్యాయన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo