e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఫ‌స్ట్‌టైం ఇల్లు కొంటే.. రుణ వాయిదా త‌గ్గింపు ఎలా?!

ఫ‌స్ట్‌టైం ఇల్లు కొంటే.. రుణ వాయిదా త‌గ్గింపు ఎలా?!

ఫ‌స్ట్‌టైం ఇల్లు కొంటే.. రుణ వాయిదా త‌గ్గింపు ఎలా?!

న్యూఢిల్లీ: భారతీయుల్లో అత్య‌ధికుల‌కు సొంతిల్లు కొనుక్కోవ‌డం ఒక డ్రీమ్‌. కానీ, ఇల్లు కొనుగోలు చేయ‌డం భారీ ఫైనాన్సియ‌ల్ క‌మిట్‌మెంట్‌. చాలా మంది హోంలోన్ సాయం లేకుండా సొంతిల్లు కొనుక్కోలేరు. ఆర్థిక సంస్థ‌ల స‌హ‌కారంతో తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వ్య‌క్తికి మ‌రింత స‌వాల్‌గా మారుతుంది.

హోంలోన్‌పై ఇలా క‌న్ఫూజ‌న్‌

రుణంపై ఇంటిని కొనుగోలు చేసేవారు త‌రుచుగా క‌న్ఫ్యూజ‌న్‌కు గుర‌వుతుంటారు. హోంలోన్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాక‌.. ఏ బ్యాంకు/ ఆర్థిక సంస్థ‌లో రుణం తీసుకోవాల‌న్న విష‌య‌మై గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు.

బ్యాంక్ ఎంపిక కీల‌కం ఇలా..

ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే ఉత్త‌మం, ష‌ర‌తులు, ఎంత రుణం ల‌భిస్తుంది, సుల‌భంగా చెల్లించ‌డానికి రుణం పేమెంట్స్ టెన్యూర్‌పై నిర్ణ‌యానికి రావాల‌న్నా క‌న్ఫ్యూజ్ అవుతారు. ఇంటి కొనుగోలుకు తీసుకునే రుణంపై నెల‌వారీగా వాయిదా చెల్లింపులు అత్యంత ముఖ్య‌మైన ఫైనాన్సియ‌ల్ క‌మిట్‌మెంట్‌.

ఇలా రుణ వాయిదా ఖ‌రారు..

వ‌డ్డీరేటుతోపాటు రుణ వాయిదా చెల్లింపుల గ‌డువును బ‌ట్టి నెల‌వారీ వాయిదా ఖ‌రార‌వుతుంది. కొనుగోలు చేసే ఇంటి విలువ‌లో బ్యాంకులు/ ఇత‌ర ఆర్థిక‌ సంస్థ‌ల‌ నుంచి పొందే రుణం శాతమే ఎల్టీవీ రేషియో.

మిగ‌తా సొమ్ము సొంతంగా…

రుణం మిన‌హా మిగిలిన మొత్తం సొమ్ము రుణ గ్ర‌హీత సొంతంగా స‌మ‌కూర్చుకోవాలి. సాధార‌ణంగా గృహ మొత్తం విలువ‌లో 80- 85 శాతం వ‌ర‌కు రుణం ఇస్తాయి. మ‌రికొన్ని సంస్థ‌లు 90% వరకూ రుణం ఆఫ‌ర్ చేస్తాయి.

ఎల్టీవీ నిష్ప‌త్తి త‌గ్గితే వాయిదా త‌గ్గుద‌ల‌

ఇంటి మొత్తం విలువ‌లో ఎల్టీవీ నిష్ప‌త్తిని త‌గ్గించుకుంటే, బ్యాంక‌ర్లు లేదా ఆర్థిక సంస్థ‌లు త‌క్కువ వ‌డ్డీకే రుణం ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా నెల‌వారీ చెల్లించే రుణ వాయిదా కూడా త‌గ్గుతుంది.

డౌన్ పేమెంట్ ఎక్కువుంటే ఇలా లాభం

ఏయే బ్యాంకులు ఎంత వ‌ర‌కు రుణం ఇస్తాయి. మిగ‌తా సొంతంగా స‌మ‌కూర్చుకోవ‌డం ఎలా అన్న అంశంపై కేంద్రీక‌రించాల్సిన బాధ్య‌త ఇంటి రుణం కొనుగోలు దారుల‌దే. ముందు క‌నీస డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగ‌తా మొత్తం రుణం తీసుకోకుండా.. డౌన్‌పేమెంట్ ఎక్కువుండేలా చూసుకోవాలి.

ఎల్టీవీ నిష్ప‌త్తితో ఇలా రిస్క్ త‌గ్గుద‌ల‌

ఇంటి కొనుగోలుదారులు త‌మ హోమ్‌లోన్ ఎల్టీవీ నిష్ప‌త్తి త‌గ్గించుకోగ‌లిగితే వారికి క్రెడిట్ రిస్క్ త‌గ్గుతుంది. ఇందువ‌ల్లే బ్యాంక‌ర్లు త‌క్కువ వ‌డ్డీ రేటుకే గృహ రుణాల‌ను ఇచ్చేందుకు ముందుకొస్తారు.

త‌క్కువ వ‌డ్డీరేటుతో వాయిదా భారం డౌన్‌

త‌క్కువ వ‌డ్డీరేటుకే హోంలోన్ తీసుకుంటే అప్పు తీసుకునే వారి ఈఎంఐ భారాన్ని త‌గ్గిస్తుంది. కొత్త‌గా గృహ రుణం తీసుకునే వారు ఎక్కువ కాల ప‌రిమితిని నిర్ణ‌యించుకోవ‌డంతో ఈఎంఐ భారం త‌గ్గించుకోవ‌చ్చు.

గ‌డువుతోపాటువ‌డ్డీ కూడా అధిక‌మే

ఎక్కువ కాల‌ప‌రిమితితో కూడిన రుణం తీసుకోవ‌డం వ‌ల్ల ఈఎంఐ భారం త‌గ్గుతుంది కానీ వ‌డ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాలి. త‌క్కువ కాల‌ప‌రిమితి ఆప్ష‌న్ ఎంచుకుంటే ఈఎంఐ ఎక్కువైనా వ‌డ్డీ మొత్తం త‌గ్గుతుంది.

ఎక్కువ కాల ప‌రిమితి లోన్ ఆమోదం ఇలా

అయితే, ఎక్కువ కాల‌ప‌రిమితి ఎంచుకునే వారి గృహ రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందే అవ‌కాశాలెక్కువ‌. కార‌ణం.. కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా ఉంటే రుణ‌వాయిదా త‌క్కువ ఉంటుంది. దీంతో రుణ గ్ర‌హీత సుల‌భంగా వాయిదాలు చెల్లించ‌గ‌లుగుతారు. రుణం ఎగ‌వేత‌కు పాల్ప‌డే రిస్క్‌ త‌క్కువ‌.

ఇలా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవాలి

గృహ‌రుణం కోసం ఏదైనా బ్యాంకును గానీ, ఆర్థిక సంస్థ‌ను గానీ నిర్ధారించుకోవ‌డానికి ముందు ఆన్‌లైన్‌లో ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల ఇంటి రుణాల వ‌డ్డీరేట్ల‌ను స‌రి చూసుకోవాలి. స‌రైన రుణం పొందేందుకు ప్ర‌స్తుతం అనేక వెబ్‌సైట్లు సాయ‌ప‌డుతున్నాయి.

వెబ్ సైట్ల‌లో స‌వివ‌రంగా రుణాల డిటైల్స్‌

వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అందించే రుణాలు, వాటిపై వ‌డ్డీ రేట్లు, ఫీజులు, ఇత‌ర ఛార్జీల వివ‌రాల‌ను ఆన్‌లైన్ పోర్ట‌ల్స్ స‌వివ‌రంగా తెలుపుతున్నాయి. మెరుగైన‌ గృహ రుణం పొందేందుకు స‌రైన రీతిలో అన్నింటిని ప‌రిశీలించి స‌రైన గృహ‌ రుణం నిర్ణ‌యించుకోవ‌డం ముఖ్యమ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

వ‌డ్డీరేట్ల‌పై బ్యాంక‌ర్లు ఇలా..

బ్యాంక‌ర్ల‌లో అత్య‌ధికులు రుణాల‌పై క‌నిష్ట‌, గ‌రిష్ఠ శ్రేణుల‌ను నిర్ణ‌యిస్తారు. కానీ వాస్త‌వంగా మీ అర్హ‌త‌ల‌కు అనుణంగా మీరు తీసుకునే రుణంపై వ‌డ్డీరేటు ఖ‌రార‌వుతుంది. రుణ గ్ర‌హీత మెరుగైన వ‌డ్డీరేటు కోసం సంప్ర‌దింపులు జ‌రిపే సామ‌ర్థ్యం క‌లిగి ఉండాలి.

స‌హ‌- రుణ గ్ర‌హీత‌ను జ‌మ చేసుకుంటే లబ్ధి

మీరు మీ ఇంటి రుణ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవ‌డంతోపాటు స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌ను జ‌త చేసుకోవాల‌ని ఫైనాన్సియ‌ల్ అడ్వైజ‌ర్లు సూచిస్తున్నారు. మ‌హిళా రుణ గ్ర‌హీత‌ల కోసం త‌రుచుగా రుణాల‌పై త‌క్కువ వ‌డ్డీ వ‌సూలు చేస్తుంటారు.

భార్య‌తో క‌లిసి రుణం తీసుకుంటే ఇలా బెనిఫిట్‌

క‌నుక సొంతింటిని కొనుగోలు చేయాల‌ని భావించే వారు త‌మ జీవిత భాగ‌స్వామిని అంటే భార్య‌ను స‌హ రుణ గ్ర‌హీత‌గా చేర్చుకుంటే మెరుగైన ఫ‌లితం ఉంటుందంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫ‌స్ట్‌టైం ఇల్లు కొంటే.. రుణ వాయిదా త‌గ్గింపు ఎలా?!

ట్రెండింగ్‌

Advertisement