శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 01, 2021 , 02:32:50

తొలి నెల ఈఎంఐ ఫ్రీ

తొలి నెల ఈఎంఐ ఫ్రీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ హ్యాప్పీ మొబైల్స్‌ పండుగ ఆఫర్లను ప్రకటించింది. కొత్త సంవత్సరంతోపాటు సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని రూ.2 కోట్ల విలువైన బహుమతులను కొనుగోలుదారులకు అందిస్తున్నది. ఎటువంటి లక్కీ డ్రా లేకుండా, ప్రతీ మొబైల్‌ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని కస్టమర్లకు అందిస్తున్న సంస్థ.. అత్యధికంగా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకార్డులపై మరో 10 శాతం ఇన్‌స్టంట్‌ క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం కల్పిస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్లు జనవరి 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు. వీటిలో ఒక్క రూపాయి చెల్లించి ఈఎంఐ పద్ధతిలో మొబైల్‌ కొనుగోలు చేసే అవకాశం కల్పించిన సంస్థ.. ఎంపిక చేసిన మొబైళ్ళపై తొలి నెల ఈఎంఐని ఉచితంగా అందిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లో 75 స్టోర్లను నిర్వహిస్తున్న సంస్థ.. వచ్చే ఏడాది చివరి నాటికి మరో 75 స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఉద్యోగులను కూడా 600 నుంచి వెయ్యికి పెంచుకునే ప్రణాళిక కూడా ఉన్నదన్నారు.   

VIDEOS

logo