శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 08, 2021 , 01:44:05

పౌల్ట్రీ వ్యర్థాలతో తొలి బయోగ్యాస్‌ యూనిట్‌

పౌల్ట్రీ వ్యర్థాలతో తొలి బయోగ్యాస్‌ యూనిట్‌

  • హైదరాబాద్‌లో ప్రారంభించిన సోలికా ఎనర్జీ

హైదరాబాద్‌, జనవరి 7:శ్రీనివాస హ్యచరీస్‌కు చెందిన సోలికా ఎనర్జీ...హైదరాబాద్‌లో పౌల్ట్రీ వ్యర్థాలతో తొలి బయోగ్యాస్‌ యూనిట్‌ను ఆరంభించింది. బాలనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను ఐవోసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రావు, శ్రీనివాస ఫార్మ్‌ సీఎండీ సురేశ్‌ ప్రారంభించారు.  రోజుకు 2.4 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో తయారైన ఈ బయోగ్యాస్‌ను ఐవోసీఎల్‌ అవుట్‌లెట్‌కు సరఫరా చేస్తున్నది. భవిష్యత్తులో ఈ యూనిట్‌ సామర్థ్యాన్ని 3 టన్నులకు పెంచున్నట్లు కంపెనీ ప్రమోటర్‌ హిమదీప్‌ తెలిపారు.  

VIDEOS

logo