శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 16, 2021 , 03:22:48

విప్రోతో ఫియట్‌ జోడీ

విప్రోతో ఫియట్‌ జోడీ

  • హైదరాబాద్‌లో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ ఏర్పాటు వేగవంతం

బెంగళూరు, జనవరి 15: ప్రపం చ ప్రఖ్యాత ఆటోమొబైల్‌ కంపెనీల్లో ఒకటైన ఫియట్‌ క్రిస్లర్‌ (ఎఫ్‌సీఏ) తన తొలి అంతర్జాతీయ డిజిటల్‌ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఎఫ్‌సీఏ ఐసీటీ ఇండియా పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ డిజిటల్‌ హబ్‌కు అవసరమైన టెక్నాలజీ సేవలను అందించేందుకు దేశీయ ఐటీ సంస్థ విప్రోను కీలక భాగస్వామిగా ఎంచుకున్నది. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఈ డిజిటల్‌ హబ్‌ కోసం 1,000 మందికిపైగా నిపుణులైన కన్సల్టెంట్లు, టెక్నాలజిస్టులతో టాలెంట్‌ పూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విప్రో వెల్లడించింది. 

VIDEOS

logo