హైదరాబాద్, నవంబర్ 29: ఫ్యాషన్స్ లిమిటెడ్(ఎఫ్ఎఫ్ఎల్) భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే ఏడాదిన్నర లోగా హైదరాబాద్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి రూ.350 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఎండీ ప్రభాత్ సేథియా తెలిపారు. ఈ నిధులతోనే 500 కొత్త యంత్రాలను 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో కొత్తగా వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.