గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 03, 2020 , 23:33:25

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత
  • కరోనా నేపథ్యంలో అత్యవసర తగ్గింపు

వాషింగ్టన్‌, మార్చి 3: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను మంగళవారం అత్యవసరంగా తగ్గించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రాణాంతక మహమ్మారితో ఎకానమీకి ముప్పేనని గ్రహించిన ఫెడ్‌ రిజర్వ్‌.. అర శాతం కోత పెట్టింది. దీంతో కొత్త వడ్డీరేటు 1-1.25 శ్రేణిలో ఉన్నది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి గమనిస్తే ఫెడ్‌ రిజర్వ్‌ ఇలా ఆకస్మికంగా వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. కాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నాయని, అయినప్పటికీ వైరస్‌ ప్రభావం పడకుండా వడ్డీరేట్లను తగ్గించామని ఈ సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలియజేశారు. వైరస్‌తో ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడకుండా తమ ఈ నిర్ణయం దోహదపడగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా పావెల్‌ వ్యక్తం చేశారు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. అమెరికాలోకీ ప్రవేశించిన విషయం తెలిసిందే. 


logo
>>>>>>