శనివారం 30 మే 2020
Business - Mar 25, 2020 , 23:27:10

జియోలో ఫేస్‌బుక్‌కు వాటా!

జియోలో ఫేస్‌బుక్‌కు వాటా!

  • 10 శాతం వాటా కొనుగోలుచేసే  యోచనలో సంస్థ

న్యూఢిల్లీ, మార్చి 25: అనతికాలంలో దేశీయ టెలికం రంగంలో అగ్రగామి సంస్థగా అవతరించిన రిలయన్స్‌ జియోలో  పది శాతం వాటా కొనుగోలు చేయడానికి సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి సంస్థయైన ఫేస్‌బుక్‌ ఆసక్తి చూపుతున్నది. ఈ నెల చివరినాటికి జియోను అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్‌ఐఎల్‌కు ఈ ఒప్పందం దోహదం చేయనున్నది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ వెల్లడించిన సమాచారం మేరకు 60 బిలియన్‌ డాలర్ల విలువైన జియోలో పది శాతానికి సమానమైన వాటా కొనుగోలు చేయడానికి ఫేస్‌బుక్‌ 6 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. ఈ ఒప్పందంపై రిలయన్స్‌ జియో, అటు ఫేస్‌బుక్‌ వర్గాలు మాత్రం స్పందించడానికి నిరాకరించాయి. 


logo