బుధవారం 03 జూన్ 2020
Business - Apr 22, 2020 , 10:18:15

జియోలో ఫేస్‌బుక్ 43,574 కోట్ల పెట్టుబ‌డులు

జియోలో ఫేస్‌బుక్ 43,574 కోట్ల పెట్టుబ‌డులు


హైద‌రాబాద్‌: రిల‌య‌న్స్ జియోలో ఫేస్‌బుక్ భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది.  రిల‌య‌న్స్ డిజిట‌ల్ బిజినెస్‌లో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు చేయ‌నున్న‌ది.  సుమారు 5.7 బిలియ‌న్ల డాల‌ర్లతో ఆ వాటాను ఫేస్‌బుక్ కొనుగోలు చేసేందుకు సిద్ద‌మైంది.  జియో ఫ్లాట్‌ఫామ్‌లో స్వ‌ల్ప పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ తెలిపారు.  ఆ పెట్టుబ‌డుల విలువ సుమారు 43,574 కోట్లు. ఓ టెక్నాల‌జీ కంపెనీ ఇంత పెట్టుబ‌డులు పెట్ట‌డం ఇదే తొలిసారి. ఇండియ‌న్ టెక్నాల‌జీ రంగంలోనూ ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ కావ‌డం విశేషం. ఫేస్‌బుక్ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ షేర్లు దూకుడు ప్ర‌ద‌ర్శించాయి. డాల‌ర్‌కు 70 రూపాయ‌లు అన్న ఒప్పందం ప్ర‌కారం పెట్టుబ‌డులు జ‌రిగాయి. 


logo