శనివారం 26 సెప్టెంబర్ 2020
Business - Aug 07, 2020 , 14:58:22

సెంటీ బిలియ‌నీర్స్ క్ల‌బ్‌లో జుక‌ర్‌బ‌ర్గ్‌

సెంటీ బిలియ‌నీర్స్ క్ల‌బ్‌లో జుక‌ర్‌బ‌ర్గ్‌

హైద‌రాబాద్‌: ఫేస్​బుక్​ సీఈవో మార్క్ జుకర్​బర్గ్ మొద‌టిసారిగా సెంటీ బిలియ‌నీర్స్ క్ల‌బ్‌లో చేరారు. అమెరికా స్టాక్ మార్కెట్‌ల‌లో ఫేస్​బుక్ షేర్లు భారీగా లాభపడటంతో జుక‌ర్‌బ‌ర్గ్ సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ఇప్పటికే సెంటీ బిలియ‌నీర్స్ జాబితాలో ఉన్న జెఫ్ బెజోస్​, బిల్​గేట్స్​ సరసన జుక‌ర్‌బ‌ర్గ్‌ చేరారు. ఫేస్​బుక్​లో ఉన్న 13 శాతం వాటా ద్వారానే మార్క్ జుకర్​బర్గ్ సంపద అధికంగా పెరిగినట్లు బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్​ పేర్కొన్న‌ది.

టిక్​ టాక్​కు పోటీగా ఫేస్‌బుక్‌ ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పటికే భార‌త్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్‌పై తాజాగా అమెరికా కూడా నిషేధం విధించింది. ఈ నిషేధం 45 రోజుల్లో  అమ‌ల్లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో టిక్​టాక్​కు ఉన్న మార్కెట్​ను రీల్స్​ దక్కించుకోగలుగుతుందనే అంచనాలతో ఫేస్​బుక్​ షేర్లకు పెట్టుబ‌డులు భారీగా పెరిగాయి. ఫలితంగా మార్క్​ జుకర్​బర్గ్ సంపద కూడా అమాంతం పెరిగిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo