సోమవారం 01 మార్చి 2021
Business - Dec 24, 2020 , 15:35:54

కొత్త లుక్‌లో ఫార్చూన‌ర్ కారు.. రిలీజ్‌ తేదీ ఖ‌రారు

కొత్త లుక్‌లో ఫార్చూన‌ర్ కారు..  రిలీజ్‌ తేదీ ఖ‌రారు

హైద‌రాబాద్‌:  ట‌యోటా కంపెనీ త‌న కొత్త ఫార్చూన‌ర్‌ను లాంచ్ చేయ‌నున్న‌ది. వ‌చ్చే నెల ఆర‌వ తేదీన ఇండియాలో కొత్త ఫార్చూన‌ర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేయ‌నున్నారు. కొత్త ఫార్చూన‌ర‌ల్‌లో చాలా మార్పులు ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది. ఈ ఏడాది కొత్త మోడ‌ల్‌ను జూలైలో థాయిలాండ్‌లో రిలీజ్ చేశారు.  అయితే 2021 మోడ‌ల్‌ను మాత్రం ఇండియాలో వ‌చ్చే నెల‌లో విడుదుల చేయ‌నున్నారు.  ట‌యోటా కంపెనీ లెజెండ‌ర్ వేరియంట్‌ను కూడా రిలీజ్‌ చేయ‌నున్న‌ది. కొత్త లుక్‌లో మ‌రింత స్లీక్‌గా ఫార్చూన‌ర్ క‌నిపించ‌నున్న‌ది. కారు ముందు భాగంలో ఎల్ఈడీ ప్రొజెక్ట‌ర్ హెడ్‌ల్యాంప్‌లు రానున్నాయి. ఫ్రంట్ బంప‌ర్‌ను మార్చేశారు.  చిన్న ఫాగ్ ల్యాంప్‌ల‌ను కూడా ఏర్పాటు చేశారు.  మ‌ల్టీస్పోక్ అలాయ్ వీల్స్‌తో కొత్త ఫార్చూన‌ర్ ద‌ర్శ‌న‌మివ్వ‌‌నున్న‌ది. వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్ల‌ను ఫిక్స్ చేశారు. ఇంటీరియ‌ర్ భాగంలో మాత్రం పెద్ద‌గా మార్పులు లేన‌ట్లు తెలుస్తోంది.  కానీ క్యాబిన్ ఏరియాలో స్వ‌ల్ప తేడాలు ఉండ‌నున్నాయి. యాపిల్‌, ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌‌కు వీలుగా 8 ఇంచుల ట‌చ్ స్క్రీన్ ఇస్తున్నారు.   

VIDEOS

తాజావార్తలు


logo