శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 20, 2020 , 01:15:24

వృద్ధులకు అదనపు వడ్డీ

వృద్ధులకు అదనపు వడ్డీ

 • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకుల ఆఫర్‌

సీనియర్‌ సిటిజన్ల కోసం దేశంలోని పలు బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి దిగ్గజ ప్రైవేట్‌ బ్యాంకులు ఈ రేసులో ముందున్నాయి. గత కొంత కాలం నుంచి వడ్డీరేట్లు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో సీనియర్‌ సిటిజన్ల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు బ్యాంకులు ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్ల టర్మ్‌ డిపాజిట్లకు ప్రస్తుతం వర్తింపజేస్తున్న వడ్డీరేట్ల కంటే అదనపు వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక పథకాల వివరాలు ఇవీ..

ఎస్బీఐ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌

సీనియర్‌ సిటిజన్ల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘ఎస్బీఐ వీ కేర్‌' పేరుతో ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మే 12 నుంచి ఈ పథకం అందుబాటులో ఉన్నది.

 • డిపాజిట్‌ కాలవ్యవధి 5 ఏండ్లు.
 • కొత్త వడ్డీ 80 బేసిస్‌  పాయింట్లు ఎక్కువ.
 • ఈ పథకం కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన సీనియర్‌ సిటిజన్లకు 6.20 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీరేటు మే 27 నుంచి అమలవుతున్నది.
 • కాలపరిమితికి ముందే డిపాజిట్లను విత్‌డ్రా చేసుకుంటే 30 బేసిస్‌ పాయింట్ల అదనపు ప్రీమియంను చెల్లించరు. అంతేకాకుండా 
 • 0.5 శాతం పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
 • గరిష్ఠ డిపాజిట్‌ రూ.2 కోట్లలోపే.

ఐసీఐసీఐ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌

‘ఐసీఐసీఐ బ్యాంక్‌ గోల్డెన్‌ ఇయర్స్‌' పేరుతో ఈ ఏడాది 

మే 20 నుంచి ఈ పథకం అందుబాటులోకి వచ్చింది.

 • l డిపాజిట్‌ కాలవ్యవధి 5 ఏండ్ల 1 రోజు నుంచి 10 ఏండ్లు.
 • l కొత్త వడ్డీ 80 బేసిస్‌ పాయింట్లు ఎక్కువ.
 • l వార్షిక వడ్డీరేటు 6.30 శాతం.
 • l ఐదేండ్ల ఒక రోజుకు ముందే డిపాజిట్లను   విత్‌డ్రా చేసుకుంటే 1% పెనాల్టీ విధిస్తారు.
 • l ఐదేండ్ల ఒక రోజు తర్వాత డిపాజిట్లను  విత్‌డ్రా చేసుకుంటే 1.30% పెనాల్టీ.
 • l గరిష్ఠ డిపాజిట్‌ రూ.2 కోట్లకు లోబడి ఉండాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌

ఈ పథకాన్ని ‘హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ సిటిజన్‌ కేర్‌' అని పిలుస్తారు. 

ఈ ఏడాది మే 18 నుంచి ఈ పథకం అందుబాటులో ఉన్నది. 

 • l డిపాజిట్‌ కాలవ్యవధి 5 ఏండ్ల 1 రోజు నుంచి 10 ఏండ్లు.
 • l కొత్త వడ్డీ 75 బేసిస్‌ పాయింట్లు ఎక్కువ.
 • l ఈ పథకం కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన సీనియర్‌  సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. దీనికి    అదనంగా 25 బేసిస్‌ పాయింట్ల ప్రీమియంను   చెల్లిస్తారు. జూన్‌ 12 నుంచి ఈ రేట్లు అమలవుతున్నాయి.
 • l ఐదేండ్లలోపే డిపాజిట్లను విత్‌డ్రా చేసుకుంటే    1 శాతం పెనాల్టీ విధిస్తారు.
 • l ఐదేండ్ల తర్వాత విత్‌డ్రా చేసుకుంటే 1.25% పెనాల్టీ.
 • l గరిష్ఠ డిపాజిట్‌ రూ.2 కోట్లకు లోబడి ఉండాలి.


logo