మంగళవారం 26 జనవరి 2021
Business - Dec 03, 2020 , 00:12:29

ఎగుమతులు 17.84% డౌన్‌

ఎగుమతులు 17.84% డౌన్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లోని తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు) దేశ ఎగుమతులు 17.84 శాతం క్షీణించాయి. ఇదే కాలంలో దిగుమతులు కూడా 33.56 శాతం క్షీణించడంతో వాణిజ్యలోటు (ఎగుమతులకు, దిగుమతులకు మధ్య తేడా) తగ్గిందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వాధ్వాన్‌ వెల్లడించారు. ‘ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో మన ఎగుమతులు 17.84 శాతం తగ్గాయి. రత్నాభరణాలు, పెట్రోలియం ఎగుమతులను మినహాయిస్తే ఈ క్షీణత ఇంకా తక్కువగా ఉంటుంది’ అని బుధవారం ఆయన వాణిజ్య బోర్డు సమావేశంలో వివరించారు. 


logo