గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Dec 16, 2020 , 02:02:29

రెండేండ్లలో రోబోల ఎగుమతి

రెండేండ్లలో రోబోల ఎగుమతి

  • హైదరాబాద్‌ కేంద్రంగా ఐరా  
  • జపాన్‌, అమెరికా సరసన భారత్‌

ఖైరతాబాద్‌: రోబోల తయారీలో జపాన్‌, అమెరికా లాంటి అగ్ర దేశాల సరసన భారత్‌ నిలువనున్నది. వీటి ఉత్పత్తికి విశ్వనగరం కేంద్ర బిందువు కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది రంగాలను ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో చేర్చగా.. అందులో రోబోటిక్స్‌ కీలకంగా ఉన్నది. 2022 చివరి నాటికి భారత్‌ నుంచి రోబోలను ఎగుమతి చేయాలన్న ధ్యేయంతో హైదరాబాద్‌ వేదికగా ఆలిండియా రోబోటిక్స్‌ అసోసియేషన్‌ (ఐరా) పురుడుపోసుకున్నది. సాలీనా 350 మిలియన్‌ డాలర్ల వ్యాపారం నిర్వహించాలన్నది ఈ అసోసియేషన్‌ లక్ష్యం. దేశవ్యాప్తంగా రోబోలను ఉత్పత్తి చేసే 5వేల సంస్థల సమాహారంగా ఏర్పాటైన ఈ అసోసియేషన్‌ను సోమాజిగూడలోని హోటల్‌ కత్రియాలో రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్‌ పాలసీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హార్డ్‌వేర్‌ రంగానికి అందజేస్తున్న ప్రోత్సాహకాలను రోబోటిక్స్‌ రంగానికీ అందిస్తామన్నారు. ఐటీ శాఖ ఓఎస్డీ ఎల్‌ రమాదేవి మాట్లాడుతూ.. అమెరికా సిలికాన్‌ వ్యాలీలో రోబోటిక్స్‌కు ఓ అసోసియేషన్‌ ఉన్నదని, ఆ దేశంలో 50 శాతం పెట్టుబడులు అక్కడి నుంచే వస్తాయని తెలిపారు. భారత్‌లో ఐరా కూడా అలాంటి పాత్ర పోషించాలని ఆక్షాంక్షించారు.  ఐరా వ్యవస్థాపక అధ్యక్షురాలు హర్షిత పువ్వాల, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

VIDEOS

logo