e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News EV Charging | 15 నిమిషాల్లో ఈవీ చార్జింగ్‌.. ఎక్స్‌పోనెంట్ ఎన‌ర్జీ టార్గెట్..?!

EV Charging | 15 నిమిషాల్లో ఈవీ చార్జింగ్‌.. ఎక్స్‌పోనెంట్ ఎన‌ర్జీ టార్గెట్..?!

EV Charging | ఒక‌వైపు రోజురోజుకు దూసుకెళ్తున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. మ‌రోవైపు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ల‌క్ష్య సాధ‌న‌.. ఆల్ట‌ర్నేటివ్‌గా ముందుకొస్తున్న ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌.. అంటే మున్ముందు విద్యుత్ వాహ‌నాల‌దే భ‌విష్య‌త్‌.. అయితే, వాటికి చార్జింగ్ ఫెసిలిటీ క‌ల్ప‌న ముఖ్యం.. ప‌లు ష‌ర‌తుల‌తో 50 నిమిషాల్లో వాహ‌నాల ఫుల్ చార్జింగ్ సామ‌ర్థ్యంతో కూడిన‌ ఫాస్ట్ చార్జింగ్ సొల్యూష‌న్స్ కొన్ని ప్రీమియం ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌కే ప‌రిమితం చేశారు.

వాహ‌న చార్జింగ్‌కు 4-8 గంట‌లు

సాధార‌ణంగా ఒక వాహనానికి రెగ్యుల‌ర్ చార్జింగ్ చేయ‌డానికి నాలుగు గంట‌ల నుంచి ఎనిమిది గంట‌ల టైం ప‌డుతుంది. వాహనాల బ్యాట‌రీల‌కు మూడేండ్ల వారంటీ ఉంటుంది. చార్జింగ్ చేస్తున్నా కొద్దీ వాటి సామ‌ర్థ్యం క్షీణిస్తుంది.

స్పీడ్ చార్జింగ్ ఫెసిలిటీల కోసం పోటీ

- Advertisement -

ఈ ప‌రిస్థితుల్లో స్పీడ్‌గా వాహ‌న చార్జింగ్ వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప‌లు సంస్థ‌లు.. స్టార్ట‌ప్‌లు పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎథేర్ ఎన‌ర్జీ వ్య‌వ‌స్థాప‌క పార్ట‌న‌ర్‌ అరుణ్ వినాయ‌క్‌.. విద్యుత్ మొబిలిటీ రంగంలోకి అడుగు పెట్టారు. క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాలూ కేవ‌లం 15 నిమిషాల్లో పూర్తి చార్జింగ్ వ‌స‌తుల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అరుణ్ వినాక‌య‌క్‌తో ఎథేర్‌ స‌హ‌చ‌రుడు సంజ‌య్ బ్యాలాల్ చేతులు క‌లిపారు. బెంగ‌ళూరులో ఎక్స్‌పోనెంట్ ఎన‌ర్జీని ప్రారంభించారు.

వాహ‌నాల చార్జింగ్ స‌ర‌ళ‌త‌రమే ల‌క్ష్యం

విద్యుత్ వాహ‌నాల చార్జింగ్ స‌ర‌ళ‌త‌రం చేయ‌డ‌మే ఎక్స్‌పోనెంట్ ల‌క్ష్యం. అందుకోసం టెక్నాల‌జీ సాయంతో ఫ్లెక్సిబుల్ ఎన‌ర్జీ సాక‌ర్ నిర్మిస్తారు. వాహ‌నాల చార్జింగ్‌కు అవ‌స‌ర‌మైన విద్యుత్ నిరంత‌రాయంగా స‌ర‌ఫ‌రా అయ్యేలా గ్రిడ్‌కు, వాహ‌నాల మ‌ధ్య స‌మాచారం అందుబాటులో ఉంచేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. 2022 జ‌న‌వ‌రి అంటే వ‌చ్చే రెండు నెల‌ల్లో రాపిడ్ చార్జింగ్ సొల్యూష‌న్‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఎక్స్‌పోనెంట్ ముందుకు సాగుతుంది.

ఈ సంస్థ చార్జింగ్ సొల్యూష‌న్స్‌లో 3000 సైకిళ్ల లైఫ్ వారంటీ గ‌ల లిథియం అయాన్ బ్యాట‌రీ సెల్స్‌ను ఉప‌యోగిస్తారు. దీంతో 15 నిమిషాల్లో క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్‌కు జీరో నుంచి వంద‌శాతం చార్జింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం ఈ-ప్యాక్‌, ఈ-పంప్ అనే బ్యాట‌రీ ప్యాక్ కూడా సిద్ధంగా ఉంటుంది.

2030 నాటికి ఇండియ‌న్ ఈవీ స్పేస్ ఇలా

ఎక్స్‌పోనెంట్ కో ఫౌండ‌ర్ అరుణ్ వినాయ‌క్ మాట్లాడుతూ.. సంక్లిష్ట‌, అంత‌రాయంతో కూడిన విద్యుత్ స‌ర‌ఫ‌రా కావ‌డంతో ఈవీల చార్జింగ్‌కు 100 శాతం ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. 2030 నాటికి ఇండియ‌న్ ఈవీ స్పేస్ 206 బిలియ‌న్ డాల‌ర్ల సామ‌ర్థ్యానికి చేరుతుంది. తీవ్ర‌మైన‌, కీల‌క‌మైన టెక్ ప్రాబ్ల‌మ్స్ సాల్వ్ చేస్తూ ఈవీల‌కు ఇంధ‌న ల‌భ్య‌త స‌ర‌ళ‌త‌రం చేయాల్సిన అవ‌స‌రం ఉంది అని చెప్పారు.

నియంత్ర‌ణ సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌ల‌తో భాగ‌స్వామ్యం..

ఎక్ప్‌పోనెంట్ కో ఫౌండ‌ర్ సంజ‌య్ బ్యాలాల్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం భార‌త్‌లో విద్యుత్ వాహ‌నాల‌కు అవ‌స‌ర‌మైన శ‌ర‌వేగంగా చార్జింగ్ వ‌స‌తులు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చేందుకు నియంత్ర‌ణ సంస్థ‌లు, ఇండ‌స్ట్రీ ప్లేయ‌ర్స్‌తో చేతులు క‌లుపుతాం అని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

Hero Pleasure+ Xtec 110cc లాంఛ్ : ధ‌ర ఎంతంటే..!

భార‌త్‌లో న్యూ ట్ర‌యంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్ల‌ర్ లాంఛ్..ధ‌ర ఎంతంటే!

Maruti Cars | పండుగ‌ల ఆఫ‌ర్‌.. మారుతీ కార్ల‌పై భారీ డిస్కౌంట్లు

Prakash Raj Panel | 11 మంది ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యుల రాజీనామా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement