మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 04, 2020 , 23:39:01

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్‌ డెవలప్‌ సెంటర్‌

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్‌ డెవలప్‌ సెంటర్‌
  • ప్రారంభించిన జయేశ్‌ రంజన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4: ప్రముఖ డాటా అనలిటిక్స్‌లో ఒకటైన ఎక్స్‌పీరియన్‌..హైదరాబాద్‌లో తన కొత్త డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఆరంభించింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్‌ అలెక్స్‌ లింట్నెర్‌ మాట్లాడుతూ.. భాగ్యనగరంలో ఐడీసీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నదని,35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో ప్రస్తుతం 200 మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా, 2024 నాటికి ఈ సంఖ్యను 2,500కి పెంచుకోనున్నట్లు చెప్పారు. ఐటీ నిపుణులను అత్యధిక మందిని ఆకట్టుకుంటున్న హైదరాబాద్‌ పరిశోధన కేంద్రంగా మారిందని, దీంతో ఇక్కడే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. మెరుగైన మౌలి క సదుపాయాలు, నాణ్యమైన విద్య, అత్యుత్తమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు సులభతర వాణిజ్య విధానం అమలులో ఐడీసీకి హైదరాబాద్‌ ఆదర్శవంతంగా నిలిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.


logo
>>>>>>