ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 27, 2021 , 02:08:52

ఊరిస్తున్న ఈ-స్కూటర్లు

ఊరిస్తున్న ఈ-స్కూటర్లు

ఈ ఏడాది రానున్న మోడళ్లు ఇవే

చిన్న చిన్న పనుల నిమిత్తం బజారుకో, మార్కెట్లకో వెళ్లాలన్నా, పిల్లలను పాఠశాలలో దింపిరావాలన్నా ఎక్కువ మంది ప్రధానంగా ఎంచుకునేది స్కూటర్లనే. సులభంగా డ్రైవింగ్‌ చేసేందుకు స్కూటర్లు అనువుగా ఉండటం, సామాన్లు తెచ్చుకునేందుకు తగినంత స్పేస్‌ ఉండటం ఇందుకు ముఖ్య కారణం. కానీ, పెట్రోల్‌ ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో చాలా మంది విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతున్న కొన్ని ప్రధాన ఈ-స్కూటర్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

సింపుల్‌ ఎనర్జీ మార్క్‌-2

బెంగళూరు స్టార్టప్‌ సింపుల్‌ ఎనర్జీ.. మే నెలలో ‘మార్క్‌-2’ ఈ-స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. ధర రూ.90 వేలు, రేంజ్‌ 240 కి.మీ.,  టాప్‌ స్పీడ్‌ గంటకు 100 కి.మీ.

యాక్టివా ఎలక్ట్రిక్‌

జపాన్‌కు కంపెనీ హోండా.. త్వరలో ‘యాక్టివా ఎలక్ట్రిక్‌' స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. దీని రేంజ్‌ దాదాపు 90 నుంచి 100 కి.మీ.

 బర్గ్‌మ్యాన్‌ ఎలక్ట్రిక్‌

జపాన్‌కే చెందిన సుజుకీ సంస్థ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘ఎలక్ట్రిక్‌ బర్గ్‌మ్యాన్‌'ను తీసుకురానున్నది. దీని ధర దాదాపు రూ.1.3 లక్షలు, రేంజ్‌ 75-80 కి.మీ.

వెస్పా ఎలెక్ట్రికా

ఇటలీకి కంపెనీ వెస్పా త్వరలో ‘వెస్పా ఎలెక్ట్రికా’ ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నది. దీని ధర దాదాపు రూ.1.5 లక్షలు.

మ్యాస్ట్రో ఎలక్ట్రిక్‌

దేశీయ  సంస్థ హీరో మోటోకార్ప్‌.. ఈ ఏడాది మధ్య నాటికి ‘మ్యాస్ట్రో ఎలక్ట్రిక్‌' స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. దీని ధర దాదాపు రూ.లక్ష. లిథియం అయాన్‌ బ్యాటరీని కలిగి ఉండే ‘మ్యాస్ట్రో ఎలక్ట్రిక్‌'.. 110 సీసీ పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే స్కూటర్‌కు సమానమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ చెప్తున్నది.

హీరో ఎలక్ట్రిక్‌ ఏఈ-29

హీరో నుంచే మార్చి నెలలో  ‘హీరో ఎలక్ట్రిక్‌ ఏఈ-29’ ఈ-స్కూటర్‌ కూడా అందుబాటులోకి రానున్నది. ధర దాదాపు రూ.85 వేలు. రేంజ్‌ సుమారు 80 కి.మీ.

VIDEOS

logo