మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 06, 2021 , 01:31:25

ఉత్సాహంగా స్లీప్‌వెల్‌ రన్‌ ఫర్‌ హెల్త్‌

ఉత్సాహంగా స్లీప్‌వెల్‌ రన్‌ ఫర్‌ హెల్త్‌

న్యూఢిల్లీ, జనవరి 5: దేశీయ ప్రముఖ మ్యాట్రెస్‌ బ్రాండ్‌ స్లీప్‌వెల్‌.. కొత్త సంవత్సరం సందర్భంగా ‘రన్‌ ఫర్‌ హెల్త్‌' మారథాన్‌ను నిర్వహించింది. 2019 నుంచి ఏటా ఈ మారథాన్‌ను స్లీప్‌వెల్‌ చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి దీన్ని ఈ నెల 3న నిర్వహించామని, 300లకుపైగా ఉద్యోగులు పాల్గొన్నారని ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది. 40 ఏండ్లకుపైగా వయసున్నవారితో ఒక గ్రూపు, 40 ఏండ్ల కు దిగువన ఉన్నవారితో మరొక గ్రూపును ఏర్పాటు చేశామని స్లీప్‌వెల్‌ మాతృసంస్థ షీలా ఫోమ్‌ తెలిపింది. వీరికి 3 లేదా 5 కిలోమీటర్ల పరుగు ఆప్షన్‌, 3 లేదా 5 కిలోమీటర్ల నడక ఆప్షన్లను ఇచ్చినట్లు వివరించింది. వీరంతా గడిచిన ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీలున్న సమయంలో ఎంచుకున్న స్థలాల్లో నడువడం లేదా పరుగెత్తడం చేశారని పేర్కొన్నది.

VIDEOS

logo