బుధవారం 03 జూన్ 2020
Business - Apr 16, 2020 , 00:49:41

ఆరోగ్య సేతుకు అనూహ్య స్పందన

ఆరోగ్య సేతుకు అనూహ్య స్పందన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: కరోనా వైరస్‌ రోగులను ట్రాక్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు మొబైల్‌ యాప్‌కు అనూహ్య స్పందన లభించింది. గడిచిన 13 రోజుల్లో ఏకంగా 5 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితామ్‌ కాంత్‌ తెలిపారు. ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో అధిక మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌గా రికార్డులోకి ఎక్కింది. ఐదు కోట్ల మంది కస్టమర్లకు చేరుకోవడానికి టెలిఫోన్‌కు 75 ఏండ్లు, రేడియోకు 38 ఏండ్లు, టీవీకి 13 ఏండ్లు, ఇంటర్నెట్‌కు 4 ఏండ్లు, ఫేస్‌బుక్‌కు 19 నెలలు, పోకోమాన్‌ గోకు 19 రోజులు పట్టగా, ఈ ఆరోగ్య సేతు యాప్‌కు కేవలం 13 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని అధిగమించిందన్నారు. 


logo