గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 13, 2021 , 23:02:07

టెస్లాతో నో యూజ్‌..విద్యుత్ కార్లపై ముందుకెళ్ల‌లేం: ఆర్‌సీ భార్గ‌వ‌

టెస్లాతో నో యూజ్‌..విద్యుత్ కార్లపై ముందుకెళ్ల‌లేం: ఆర్‌సీ భార్గ‌వ‌

న్యూఢిల్లీ: గ‌్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల దిగ్గ‌జం టెస్లా.. భార‌త్ మార్కెట్‌లో అడుగిడినా పెద్ద మార్పేమీ ఉండ‌బోదంటున్నారు దేశంలోనే అతిపెద్ద ప్ర‌యాణికుల కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి చైర్మ‌న్ ఆర్‌సీ భార్గ‌వ‌. వ‌చ్చే ఐదేండ్ల‌లో భార‌త్ రోడ్ల‌పై భారీగా విద్యుత్ కార్లు వ‌స్తాయ‌ని తాను విశ్వ‌సించ‌డం లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. దీనికి చైనాయే కార‌ణం అని ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. 

భార‌త‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాట‌రీ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్లే లేవు. విద్యుత్ కార్ల వాడ‌కానికి బ్యాట‌రీల ఉత్ప‌త్తి స‌రిప‌డినంత లేక‌పోవ‌డం పెద్ద లోట‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ఆర్‌సీ భార్గ‌వ‌. ఈనాడు చైనా నుంచి బ్యాట‌రీలు దిగుమ‌తి చేసుకుంటేనే దేశంలో విద్యుత్ కార్ల వినియోగం ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. బ్యాట‌రీల‌పై ప్ర‌ధానంగా చైనాపై ఆధార‌ప‌డి ముందుకు వెళ్లాలంటే భార‌త ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ ఇండ‌స్ట్రీ ఎదుగుద‌ల అనుమాన‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. 

విద్యుత్ కార్ల‌లో వినియోగించ‌డానికి అవ‌స‌ర‌మైన టెక్నాల‌జీ నెమ్మ‌దిగా గ్రోత్ సాధించింద‌ని ఆర్‌సీ భార్గ‌వ పేర్కొన్నారు. ప‌లితంగా బ్యాట‌రీల ధ‌ర‌లు ఎక్కువ‌య్యాయ‌ని తెలిపారు. ఉత్ప‌త్తి వ్య‌యం దిగి రాకుంటే, చిన్న కార్ల త‌యారీ దారులు గ్రీన్‌కార్లను త‌యారు చేయ‌డానికి నిరాస‌క్తంగా ఉంటార‌ని చెప్పారు. ఇన్‌ఫ్రా, బ్యాట‌రీ చార్జింగ్ వ‌స‌తులు లేకుండా భార‌త్ ర‌హ‌దారుల‌పై విద్యుత్ వాహ‌నాలు ముందుకు సాగ‌డం క‌ష్ట సాధ్యం అని అన్నారు. 

లిథియంతో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టెక్నాల‌జీతో బ్యాట‌రీల‌ను అభివ్రుద్ధి చేయాల‌న్నా.. చైనా నుంచి లిథియం దిగుమ‌తి చేసుకోవాల్సిందేన‌న్నారు. అధిక శాతం లిథియం వ‌న‌రుల‌ను చైనా నియంత్రిస్తున్న‌ద‌న్నారు ఆర్‌సీ బార్గ‌వ‌. ఇటువంటి వ్యూహాత్మ‌క స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వం ద్రుష్టి సారించాల‌ని సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo