బుధవారం 03 జూన్ 2020
Business - Apr 05, 2020 , 23:31:40

పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఆధార్‌

పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఆధార్‌

-ఈపీఎఫ్‌వో ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: ఇకపై ఆన్‌లైన్‌ సేవల్లో జనన ధ్రువీకరణగా ఆధార్‌ కార్డును చూపవచ్చని ఈపీఎఫ్‌వో తమ ఖాతాదారులకు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ వెసులుబాటును కల్పించింది. అన్ని క్షేత్రస్థాయి కార్యాలయాలకూ ఈ మేరకు సూచనలు చేసింది. ఆధార్‌ కార్డులో పేర్కొన్న పుట్టినతేదీ ఆధారంగా ఈపీఎఫ్‌వో రికార్డుల్లో తమ పుట్టినతేదీలను ఖాతాదారులు సవరించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే వైరస్‌ కష్టాల దృష్ట్యా నగదు ఉపసంహరణకు ఖాతాదారులందరికీ ఈపీఎఫ్‌వో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.


logo