e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News EPFO Relief: రూ.ల‌క్ష మెడిక‌ల్ అడ్వాన్స్‌!!

EPFO Relief: రూ.ల‌క్ష మెడిక‌ల్ అడ్వాన్స్‌!!

EPFO Relief: రూ.ల‌క్ష మెడిక‌ల్ అడ్వాన్స్‌!!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రినీ చుట్టుముట్టిన వేళ‌… ఉద్యోగ భ‌విష్య‌త నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) త‌మ స‌భ్యుల‌కు కొంత రిలీఫ్ క‌ల్పించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో చికిత్స కోసం ద‌వాఖాన‌లో చేరితే మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ కింద త‌మ స‌భ్యులు రూ. ల‌క్ష వ‌ర‌కు విత్ డ్రా చేసుకునేందుకు అనుమ‌తించింది.

ఒక‌వేళ మీరు ఈపీఎఫ్ స‌బ్‌స్క్రైబ‌ర్ అయితే.. కోవిడ్‌-19 స‌హా ఏదేనీ ప్రాణాంత‌క వ్యాధుల చికిత్స కోసం రూ. ల‌క్ష వ‌ర‌కు విత్ డ్రా చేసుకోవ‌చ్చు. స‌ద‌రు న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ చేసుకోవ‌డానికి హాస్పిట‌లైజేష‌న్ వ్య‌యంపై అంచ‌నాలు స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఈపీఎఫ్‌వో తెలిపింది.

మెడిక‌ల్ అడ్వాన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఇలా:

మీరు అధికారిక ఈపీఎఫ్‌వో పోర్ట‌ల్‌: https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ను సంద‌ర్శించాలి.
మీ యూఏఎన్‌, పాస్‌వ‌ర్డ్‌, క్యాప్చా వివ‌రాలు న‌మోదు చేసి లాగిన్ కావాలి.
‘ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌’ టాబ్ వ‌ద్ద‌కెళ్లి ‘క్లెయిమ్ (ఫామ్‌-31, 19, 10సీ, 10డీ)’ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

EPFO Relief: రూ.ల‌క్ష మెడిక‌ల్ అడ్వాన్స్‌!!

నూత‌న పేజీపై యూఏఎన్‌తో అనుసంధానించిన మీ బ్యాంకు ఖాతా వివ‌రాలు రిజిస్ట‌ర్ చేయాలి.
బ్యాంక్ ఖాతా వివరాలు వెరిఫై అయిన త‌ర్వాత జాగ్ర‌త్త‌గా చ‌దివి ఈపీఎఫ్‌వో ట‌ర్మ్స్ అండ్ కండీష‌న్స్ ఆమోదించాలి.

అటుపై టాప్‌కెళ్లి ‘ప్రొసీడ్ ఫ‌ర్ ఆన్‌లైన్ క్లెయిమ్‌’, న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ కోసం ఆప్ష‌న్లు నింపి ‘మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ’ ని ఎంపిక చేసుకోవాలి. అర్హులైన స‌భ్యుల‌కు మాత్ర‌మే ఈ ఆప్ష‌న్ క‌నిపిస్తూ ఉంటుంది.
ఈ మెడిక‌ల్ అడ్వాన్స్‌.. ఉద్యోగికి గానీ, వారి కుటుంబ స‌భ్యుల‌కు గానీ తీసుకోవ‌చ్చు.

ప్ర‌భుత్వ/ ప్ర‌భుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)/ సీజీహెచ్ఎస్ ప్యానెల్ అప్రూవ్ చేసిన ద‌వాఖాన‌లోనే రోగి త‌ప్ప‌నిస‌రిగా చికిత్స పొందాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌, ఎమ‌ర్జెన్సీలో ఏదైనా ప్రైవేట్ ద‌వాఖాన‌లో చికిత్స పొందితే, దాన్ని నిపుణుల టీం ఆమోదించాకే మెడిక‌ల్ అడ్వాన్స్ ల‌భిస్తుంది.

EPFO Relief: రూ.ల‌క్ష మెడిక‌ల్ అడ్వాన్స్‌!!

ఉద్యోగి గానీ, ఉద్యోగి కుటుంబ స‌భ్యుడు గానీ.. రోగి, ఆయ‌న చికిత్స పొందుతున్న ద‌వాఖాన వివ‌రాల‌ను ఒక రిక్వెస్ట్ లెట‌ర్ రూపంలో ఈపీఎఫ్‌వోకు స‌మ‌ర్పించాలి. ద‌వాఖాన‌ ఖ‌ర్చు వివ‌రాలు తెలియ‌ద‌ని, అడ్వాన్స్ కావాల‌ని త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాలి.

ద‌వాఖాన‌లో చికిత్స ప్రారంభించానికి ముందే సంబంధిత చికిత్స పొందుతున్న రోగి ఖాతాలో ఈపీఎఫ్‌వో రూ. ల‌క్ష డిపాజిట్ చేస్తుంది. వ‌ర్కింగ్ డే రోజే ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వెంట‌నే అడ్వాన్స్ విడుద‌ల అవుతుంది.

రోగిగా చికిత్స పొంద‌డానికి డ‌బ్బు అవ‌స‌ర‌మైతే నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అద‌న‌పు అడ్వాన్స్ తీసుకోవ‌చ్చు. అయితే, చికిత్స పూర్త‌యి ద‌వాఖాన నుంచి డిశ్చార్జి కావ‌డానికి ముందు మంజూర‌వుతుంది.

EPFO Relief: రూ.ల‌క్ష మెడిక‌ల్ అడ్వాన్స్‌!!

ఈ మెడిక‌ల్ అడ్వాన్స్ స‌ద‌రు ఈపీఎఫ్ఓ స‌భ్యుడి ఖాతాలో గానీ, ఆ స‌భ్యుడి కుటుంబ స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌వాఖాన ఖాతాలో జ‌మ చేయొచ్చు.

ద‌వాఖాన నుంచి డిశ్చార్జి అయిన 45 రోజుల్లో అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ బిల్లును ఈపీఎఫ్‌వోకు స‌మ‌ర్పించాలి. ఈపీఎఫ్ విత్ డ్రాయ‌ల్ నిబంధ‌న‌ల‌తోపాటు ద‌వాఖాన బిల్లుకు అనుగుణంగా మెడిక‌ల్ బిల్లు స‌ర్దుబాటు చేస్తారు.

మెడిక‌ల్ అడ్వాన్స్ కోసం ఆరు నెల‌ల క‌నీస వేతనం, డీఏ, ఈపీఎఫ్‌వోలో స‌భ్యుడి వాటా ప్ల‌స్ వ‌డ్డీ ఏదో ఒక‌దాన్ని పాటించాలి. ఈపీఎఫ్‌లో చేరాక ఎప్పుడైనా మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ అడ్వాన్స్ తీసుకోవ‌చ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి:

చ‌రిత్ర‌లో ఈరోజు.. భాగ‌మ‌తి న‌దిలో రైలు దుర్ఘ‌ట‌న‌కు 40 ఏండ్లు

రూ.78 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

స్పేస్‌స్టేష‌న్‌కు వెళ్తూ ప‌గ‌టి పూట స్ప‌ష్టంగా కనిపించిన స్పేస్‌క్రాఫ్ట్‌.. వీడియో

అందుకే వారు తెల్లారేస‌రికి కోటీశ్వ‌రులు..ఎలాగంటే

జొమాటో టార్గెట్: 9 ఏండ్ల‌లో పూర్తిగా విద్యుత్ వాహ‌నాల‌వైపు!!

త్వ‌ర‌లో విప‌ణిలోకి జియో 5జీ ఫోన్‌.. ధ‌రెంతంటే?!

డిసెంబ‌ర్‌క‌ల్లా రూ.60 వేల‌కు బంగారం?!

వృద్ధుల కోసం స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు..!!

ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గ‌మ‌నిక‌.. ఆ ప‌త్రాలు స‌మ‌ర్పిస్తేనే సేవ‌లు

జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడిగించిన పేటీఎం…

చికిత్స కోస‌మే ఇండియా వ‌దిలాను.. నేను చ‌ట్టాన్ని గౌరవించే వ్యక్తిని!

ఇమ్రాన్ మాట : భార‌త్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే, కానీ..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
EPFO Relief: రూ.ల‌క్ష మెడిక‌ల్ అడ్వాన్స్‌!!

ట్రెండింగ్‌

Advertisement