మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 07, 2020 , 01:57:52

నిర్మా చేతికి ఇమామీ సిమెంట్

నిర్మా చేతికి ఇమామీ సిమెంట్
  • డీల్ విలువ రూ.5,500 కోట్లు

కోల్‌కతా, ఫిబ్రవరి 6: ఇమామీ గ్రూప్ తమ సిమెంట్ వ్యాపారాన్ని నువోకో విస్తాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిర్మా సిమెంట్)కు అమ్మేస్తున్నది. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇమామీ సిమెంట్ వ్యాపా ర సంస్థ విలువను రూ.5,500 కోట్లుగా లెక్కించారు. వ్యాపార సామర్థ్యం 8 మిలియన్ టన్నులపైనే. పశ్చిమ బెంగాల్, ఒడిషా, చత్తీస్‌గఢ్, బీహార్‌లలో ఇమామీ సిమెంట్ వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. దీనికి ఒక ప్లాంట్, మూడు గ్రైండింగ్ యూనిట్లున్నాయి. కాగా, ఇమామీ సిమెంట్ కోసం అల్ట్రాటెక్, లఫర్జ్‌హోలీసిం, స్టార్ సిమెంట్ కంపెనీలూ పోటీ పడ్డా యి. కానీ చివరకు నిర్మా చేజిక్కించుకున్నది. ఈ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసి నువోకో, నిర్మా గ్రూప్ ముందుకు తీసుకెళ్లగలవు అన్న విశ్వాసాన్ని ఇమామీ గ్రూప్ డైరెక్టర్ మనీశ్ గోయెంకా వ్యక్తం చేశారు. నిజానికి ఈ డీల్‌పై మరింత ఆదాయాన్ని ఇమామీ ఆశించింది. అయినప్పటికీ రూ.5,500 కోట్లకు మిం చి రాలేదు. ఇమామీ గ్రూప్ రుణ భారం దాదాపు రూ.2,600 కోట్లుగా ఉన్నది. 


logo
>>>>>>