శనివారం 06 జూన్ 2020
Business - May 02, 2020 , 11:45:28

ఒక్క‌ ట్వీట్‌తో 1400 కోట్ల‌ డాల‌ర్లు మాయం..

ఒక్క‌ ట్వీట్‌తో 1400 కోట్ల‌ డాల‌ర్లు మాయం..

హైద‌రాబాద్‌: టెస్లా వ్య‌స్థాప‌కుడు ఎల‌న్ మ‌స్క్ చేసిన కొన్ని ట్వీట్స్‌.. ఆయన కంపెనీకి సుమారు 14 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టాన్ని తెచ్చిపెట్టింది.  కార్ల కంపెనీ టెస్లా షేర్ విలువ మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆయ‌న చేసిన ట్వీట్‌.. ఆ సంస్థ మార్కెట్ వాల్యూను కుదేల‌య్యేలా చేసింది. ఆయ‌న ట్వీట్ వ‌ల్ల స్వంత కంపెనీ టెస్లా షేర్ల వాల్యూ కూడా సుమారు మూడు బిలియ‌న్ల డాల‌ర్లు ప‌డిపోయింది. షేర్ విలువ ఎక్కువ‌గా ఉంద‌ని ట్వీట్ చేయ‌గానే.. చాలా మంది ఇన్వెస్ట‌ర్లు ఆ కంపెనీ నుంచి వైదొలిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఓ ట్వీట్‌లో త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ గురించి కూడా టెస్లా చేసిన ట్వీట్ అయోమ‌యంలో ప‌డేసింది. 2018లో కూడా మ‌స్క్ చేసిన ఓ ట్వీట్ వ‌ల్ల న్యూయార్క్ స్టాక్‌మార్కెట్‌కు న‌ష్టం వ‌చ్చింది. అప్పుడు ఆయ‌న‌కు 20 మిలియ‌న్ల డాల‌ర్ల జ‌రిమానా విధించారు. షేర్ వాల్యూ ఎక్కువ‌గా ఉంద‌న్న ట్వీట్ నిజ‌మేనా అని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ సంప్ర‌దించ‌గా.. టెస్లా కాద‌ని స‌మాధానం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యానికి దారి తీసింది. వాస్త‌వానికి ఈ ఏడాది ఆరంభంలో టెస్లా కంపెనీ షేర్ విలువ పెరిగింది. ఎల‌క్ట్రిక్ కార్ల సంస్థ విలువ సుమారు వంద బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది.  అయితే మ‌స్క్ తాజా ట్వీట్స్‌తో మాత్రం ఇన్వెస్ట‌ర్లు తిక‌మ‌క‌కు గుర‌వుతున్నారు. logo