శనివారం 06 మార్చి 2021
Business - Feb 19, 2021 , 18:00:28

క్యాష్‌కంటే బిట్‌కాయిన్ బెస్ట్‌.. అయితే!

క్యాష్‌కంటే బిట్‌కాయిన్ బెస్ట్‌.. అయితే!

న్యూఢిల్లీ: క‌్రిప్టో క‌రెన్సీ బిట్ కాయిన్‌ను గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల దిగ్గ‌జం టెస్లా సీఈవో ఎల‌న్‌మ‌స్క్ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. అడ్వెంచ‌ర్లు చేయాలంటే న‌గ‌దు కంటే క్రిప్టో క‌రెన్సీ రూపేణా ఉండ‌ట‌మే బెట‌ర్ అని ఎల‌న్ మ‌స్క్ గురువారం ట్వీట్ చేశారు. సంప్ర‌దాయ క‌రెన్సీ కంటే బిట్ కాయిన్ ఉంటేనే మంచిద‌న్నారు. బిట్ కాయిన్‌లో 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్టిన ఎల‌న్ మ‌స్క్‌.. త‌న నిర్ణ‌యం స‌బ‌బేన‌ని స‌మ‌ర్థించుకున్నారు. 

బిట్ కాయిన్‌లో పెట్టుబ‌డులు పెట్టిన వారు త‌మ‌కు వ‌చ్చిన కీవ‌ర్డ్ (పాస్‌వ‌ర్డ్‌)ను మ‌రిచిపోవ‌ద్ద‌ని ఎల‌న్ మ‌స్క్ సూచించారు. బిట్ కాయిన్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్లే దాని విలువ మ‌రింత పైపైకి దూసుకెళ్తోంది. ప్ర‌స్తుతం దాని విలువ 51,284 డాల‌ర్లు ఉంటుంది. బిట్ కాయిన్‌తో లావాదేవీల‌ను వీసా, మాస్ట‌ర్ కార్డ్ సంస్థ‌ల‌తోపాటు ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్స్ స‌మ‌ర్ధించిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo