గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 20, 2021 , 20:25:57

మ‌ళ్లీ ప్ర‌పంచ కుబేరుడిగా మ‌స్క్‌.. ఎలాగంటే?!

మ‌ళ్లీ ప్ర‌పంచ కుబేరుడిగా మ‌స్క్‌.. ఎలాగంటే?!

లండ‌న్‌: స‌్పేస్ఎక్స్ సీఈవో అండ్ సీటీవో, గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ మ‌రోమారు ప్ర‌పంచంలోనే అగ్ర‌శ్రేణి కుబేరుడిగా నిలిచారు. దీంతో అమెజాన్ వ్య‌వస్థాప‌కుడు జెఫ్ బెజోస్ ద్వితీయ స్థానానికి ప‌డిపోయారు. ప్ర‌పంచ బిలియ‌నీర్ల ఇండెక్స్‌లో 2021లో తొలి స్థానానికి రావ‌డం ఎల‌న్‌మ‌స్క్‌కు ఇది రెండోసారి. 

బ్లూంబ‌ర్గ్ ఇండెక్స్ ప్ర‌కారం ఎల‌న్‌మ‌స్క్ సార‌థ్యంలోని స్పేస్ఎక్స్ కంపెనీలో తాజాగా 850 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్ట‌డంతో ఆయ‌న సంప‌ద 199.9 బిలియ‌న్ డాల‌ర్ల‌కు దూసుకెళ్లింది. సెక్వ్యియా క్యాపిట‌ల్ సార‌థ్యంలోని ఇన్వెస్ట‌ర్ల గ్రూప్ ఈ పెట్టుబ‌డులు పెట్టింది. ఇక స్పెస్ఎక్స్ కంపెనీ విలువ 74 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. గ‌తేడాది ఆగ‌స్టు నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీ విలువ 60 శాతం పెరిగింది. 

క్రితం వారం 194.2 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో జెఫ్ బెజోస్‌.. ఎల‌న్‌మ‌స్క్‌ను దాటేసి మొద‌టి స్థానానికి చేరారు. అంత‌కుముందు క్రిప్టో క‌రెన్సీ బిట్ కాయిన్‌లో 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు ఎల‌న్‌మ‌స్క్ ప్ర‌క‌టించడంతో దాని విలువ 50 వేల డాల‌ర్ల‌ను దాటేసింది. బిట్ కాయిన్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత స‌మీప భ‌విష్య‌త్‌లో త‌మ ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌కు బిట్ కాయిన్‌ను అనుమ‌తించ‌నున్నామ‌ని మ‌స్క్ వెల్ల‌డించారు. 

VIDEOS

logo