శనివారం 06 మార్చి 2021
Business - Jan 07, 2021 , 12:13:44

కొత్త కుబేరుడు.. బెజోస్‌ను మించిపోనున్న ఎలోన్ మ‌స్క్‌

కొత్త కుబేరుడు.. బెజోస్‌ను మించిపోనున్న ఎలోన్ మ‌స్క్‌

న్యూయార్క్‌: మూడేళ్లుగా ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడిగా ఉన్న జెఫ్ బెజోస్ త్వ‌ర‌లోనే త‌న స్థానాన్ని కోల్పోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలోన్ మ‌స్క్.. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ ప‌ర్స‌న్‌గా అవ‌తరించే దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం బెజోస్ కంటే కేవ‌లం 300 కోట్ల డాల‌ర్లు మాత్ర‌మే వెనుక‌బ‌డి ఉన్నారు. మ‌స్క్ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ కంపెనీ టెస్లా షేర్లు ఆకాశమే హ‌ద్దుగా దూసుకెళ్తుండ‌టంతో ఆయ‌న సంప‌ద ఊహ‌కంద‌ని స్థాయిలో పెరిగిపోయింది.

చ‌రిత్ర‌లో తొలిసారి

సౌతాఫ్రికాలో జ‌న్మించిన ఎలోన్ మ‌స్క్ సంప‌ద బుధ‌వారానికి 18110 కోట్ల డాల‌ర్ల‌కు చేరింది. ఒక్క ఏడాదిలోనే మ‌స్క్ 15000 కోట్ల డాల‌ర్లు సంపాదించ‌డం గ‌మ‌నార్హం. చ‌రిత్ర‌లో ఇంత వేగంగా ఈ స్థాయి సంపాద‌న ఇదే తొలిసారి. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా టెస్లా షేర్లే. ఈ సంస్థ షేర్ల ధ‌ర 12 నెల‌ల కాలంలో ఏకంగా 743 శాతం పెరిగింది. టెస్లాతోపాటు మ‌స్క్ స్పేస్ ఎక్స్ సంస్థ‌కు కూడా సీఈవోగా ఉన్నారు. అమెరికాలో డెమొక్రాట్లు అధికారం చేప‌ట్ట‌డంతో ఎలోన్ మ‌స్క్ సంప‌ద మ‌రింత వేగంగా పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అమెరికాలో ఎల‌క్ట్రిక్ వాహనాల వాడ‌కాన్ని డెమొక్రటిక్ పార్టీ ప్రోత్స‌హిస్తుండ‌ట‌మే దీనికి కార‌ణం. 


ఇవి కూడా చ‌ద‌వండి

అస‌లు క్యాపిట‌ల్ హిల్ అంటే ఏంటో తెలుసా?

1814లో బ్రిటీష‌ర్లు.. ఇప్పుడు ట్రంప్ అభిమానులు

అమెరికా కాంగ్రెస్‌లో ఆందోళన హింసాత్మకం.. ఒకరి మృతి

ఐ ల‌వ్ యూ.. రెచ్చ‌గొట్టిన ట్రంప్‌

ట్రంప్ మ‌ద్ద‌తుదారుల‌పై మోదీ అస‌హ‌నం

VIDEOS

logo