శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 23, 2021 , 21:07:20

మస్క్‌కు షాక్‌..ఒక్కరోజులో 15 బిలియన్ డాలర్ల నష్టం!

మస్క్‌కు షాక్‌..ఒక్కరోజులో 15 బిలియన్ డాలర్ల నష్టం!

వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో  టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలోన్ మ‌స్క్ మరో స్థానం కోల్పోయాడు.  టెస్లా  ఇంక్‌.  షేర్లు సోమవారం 8.6 శాతం పడిపోయాయి. షేర్లు పతనమవడంతో తన నికర సంపద నుంచి ఒక్కరోజులోనే మస్క్‌ 15 బిలియన్‌ డాలర్లు నష్టపోయాడు. గతేడాది సెప్టెంబర్‌ తర్వాత టెస్లా షేర్లు భారీగా క్షీణించడం ఇదే తొలిసారి.  

బిట్‌కాయిన్‌ విలువ అనూహ్యంగా పెరుగుతుండగా.. బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోందంటూ  మస్క్‌ ట్వీట్ చేశారు. మస్క్‌ బిట్‌కాయిన్‌పై ట్విటర్లో చేసిన వ్యాఖ్యల కారణంగా  స్టాక్‌మార్కెట్‌లో లక్ష కోట్లు పోగొట్టుకున్నాడు.  బిట్​కాయిన్లలో దాదాపు 1.5 బిలియన్​ డాలర్లను టెస్లా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో బిట్​కాయిన్ విలువ ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. 

VIDEOS

logo