బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 12, 2020 , 00:06:54

తొలి ఈ-ట్రాక్టర్‌

తొలి ఈ-ట్రాక్టర్‌
  • ప్రవేశపెట్టిన హైదరాబాద్‌ స్టార్టప్‌ సెలస్టైల్‌
  • సింగిల్‌ చార్జింగ్‌తో 75 కి.మీ ప్రయాణం

హైదరాబాద్‌, మార్చి 11: దేశీయ మార్కెట్లోకి విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్లు కూడా వచ్చేశాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్‌ సెలస్టైల్‌ ఈ-మొబిలిటీ తొలి ఎలిక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. ఈ ట్రాక్టర్‌ 6 హెచ్‌పీల (21హెచ్‌పీ డీజిల్‌ ట్రాక్టర్‌కు సమానం) శక్తిని ఇవ్వనున్నది. సింగిల్‌ చార్జింగ్‌తో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఈ ట్రాక్టర్‌ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ కో-ఫౌండర్‌, సీఈవో సిద్దార్థ దురైరాజన్‌ తెలిపారు. ఈ ట్రాక్టర్‌ వినియోగించిన వారికి సరాసరిగా గంటకు రూ.20 నుంచి 35 మేర ఖర్చు కానున్నది. 


హైదరాబాద్‌లోని బాలానగర్‌ వద్ద ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్‌ ప్లాంట్లో ప్రస్తుతం నెలకు 100 ట్రాక్టర్లు తయారవుతున్నాయని, డిమాండ్‌ అధికంగా ఉంటే వచ్చే మూడేండ్లకాలంలో ఈ కెపాసిటీని 8 వేలకు పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ట్రాక్టర్‌ ధర రూ.5 లక్షల లోపు ఉంటుందని సంకేతాలిచ్చారు. ఏడాది క్రితం ఈ-మొబిలిటీ విభాగంలోకి అడుగుపెట్టిన సంస్థ..సింగపూర్‌కు చెందిన యాంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి 2 లక్షల డాలర్ల నిధులను సేకరించింది. వచ్చే ఆరు నెలల్లో మరో 6-8 మిలియన్‌ డాలర్ల(రూ.50 కోట్ల వరకు) నిధులను సేకరించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 


logo