శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 16, 2020 , 00:01:59

ఏడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌గా అశోక్‌ లావాసా

ఏడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌గా అశోక్‌ లావాసా

న్యూఢిలీ : ప్రస్తుత ఎలక్షన్‌ కమిషనర్‌ అశోక్‌ లావాసా..ఫిలిప్పీన్స్‌కు చెందిన ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతనే నూతన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. లావాసా అక్టోబర్‌ 2022లో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా పదవీ విరమణ చేయనున్నారు.  ఏడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌గా లావాసాను నియమించాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నది.   వచ్చే నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న దివాకర్‌ గుప్తా స్థానాన్ని లావాసా భర్తీ చేయనున్నారు.


logo