శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Jul 29, 2020 , 02:05:24

జీవీకేపై ఈడీ దాడులు హైదరాబాద్‌, ముంబైల్లో సోదాలు

జీవీకేపై ఈడీ దాడులు హైదరాబాద్‌, ముంబైల్లో సోదాలు

న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్‌ కేసులో జీవీకే గ్రూపు అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్‌ రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు నిర్వహించింది. ముంబై విమానాశ్రయ అభివృద్ధిలో రూ.705 కోట్ల అవకతవకలపై నిగ్గు తేల్చడానికి జీవీకే గ్రూపుతోపాటు ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లకు సంబంధించి తొమ్మిది చోట్ల ఈ దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జీవీకే గ్రూపు ప్రమోటర్లపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ప్రీవెంటివ్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 3 కింద ఈ తనిఖీలు చేపట్టారు. 


logo